అఖండ 2..అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమా థియేటర్లో చూసి గోల చేయడం కోసం ఎంతో ప్రిపేర్ అయ్యారు. థియేటర్లో విసిరేయడం కోసం పేపర్లు కూడా రెడీ చేసుకున్నారు. పెద్ద హడావిడి చేసేసారు.కానీ ఫైనల్ గా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ నిర్మాణ సంస్థ సినిమా విడుదలను ఆపేస్తున్నాం అంటూ సంచలన పోస్ట్ పెట్టింది. దీంతో బాలకృష్ణ అభిమానుల్లో ఉన్న ఆవేదన, కోపం అంతా కాదు. అయితే చిన్న హీరో, చిన్న సినిమా అంటే ఏదో ఇష్యూస్ వచ్చాయిలే అని అనుకుంటారు. కానీ పెద్ద హీరో పెద్ద సినిమా విషయంలో ఇలా జరిగింది అంటే అభిమానులు అస్సలు ఊరుకోరు. అలా డిసెంబర్ 4 అర్థరాత్రి నుండి ప్రీమియర్స్ షోస్ పడాల్సిన అఖండ-2 ప్రీమియర్స్ పడకపోవడంతో చాలామంది అభిమానులు నిరాశ పడ్డారు. కనీసం డిసెంబర్ 5నైనా విడుదలవుతుందని ఆశపడ్డారు. 

కానీ ఫైనల్ కి వచ్చేసరికి పూర్తిగా సినిమాని వాయిదా వేసుకున్నారు. దీంతో అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్లే సినిమా వాయిదా పడిందని చెప్పినప్పటికీ అసలు కారణం వేరే ఉందట. అదేంటంటే.. 14 రీల్స్ నిర్మాణ సంస్థకి మరో నిర్మాణ సంస్థకి మధ్య ఉన్న లావాదేవీల కారణంగానే ఈ సినిమా ఆగిపోయిందట.అయితే 14 రీల్స్ సంస్థ ఈరోస్ సంస్థకి గతంలో వచ్చిన రెండు సినిమాల కి సంబంధించిన లావాదేవీల ఇష్యూ నడుస్తుందట. అయితే చాలా సంవత్సరాలుగా ఇలాగే కొనసాగుతుందట. ఇప్పటివరకు 14 రీల్స్ సంస్థ ఈరోస్ సంస్థకి డబ్బులు చెల్లించలేదట. దీంతో ఏరోస్ సంస్థ వాళ్లు అఖండ -2 సినిమాని వాయిదా వేయించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఆగిపోవడం వెనక మరో హీరో హస్తం ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.ఆ హీరో ఎవరంటే సూపర్ స్టార్ మహేష్ బాబు..

అసలు అఖండ -2 సినిమా వాయిదా పడడానికి, మహేష్ బాబు కి ఏంటి సంబంధం అని అందరికీ ఓ డౌట్ ఉంటుంది. అయితే మహేష్ బాబు గతంలో నటించిన ఆగడు, 1 నేనొక్కడినే వంటి సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల ఈరోస్ సంస్థకు భారీగా నష్టాలు వచ్చాయట. ఇక ఈ నష్టాల్లో ఈరోస్ సంస్థ కి 14 రీల్స్ సంస్థ 28 కోట్లు చెల్లించాల్సి ఉందట.కానీ ఇప్పటివరకు కూడా ఆ డబ్బుని ఈరోస్ సంస్థకి 14 రీల్స్ సంస్థ చెల్లించకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. దాంతో చిలికి చిలికి గాలి వానలా మారినట్టు సినిమా చివరికి వాయిదా పడేలా చేశారు. ఇక ఈ విషయం వైరలవ్వడంతో మహేష్ బాబు నటించిన ప్లాప్ సినిమాల వల్లే బాలకృష్ణ అఖండ -2 వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ మహేష్ బాబు పై నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: