బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం 'అఖండ' సృష్టించిన రికార్డులు, ప్రేక్షకులను అలరించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేనివి. అందుకే, ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలై ఉంటే, ఇప్పటికే థియేటర్ల ముందు పండగ వాతావరణం కనిపించేది. రివ్యూలు కూడా వెలువడి, సినిమా స్థాయిపై ఒక స్పష్టత వచ్చేది. కానీ, అభిమానుల ఆశలకు అడ్డుకట్ట వేస్తూ, సినిమా విడుదల వాయిదా పడింది.

ఈ వార్త ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పలు ప్రాంతాల్లో థియేటర్ల ముందు తమ నిరసనను తెలియజేస్తూ ధర్నాలు కూడా చేశారు. ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా ప్రీమియర్‌ షోలు ఆగిపోవడంతో అక్కడి ఫ్యాన్స్ కూడా నిరుత్సాహానికి లోనయ్యారు. 'అఖండ 2' తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డుల వర్షం కురిపించాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్‌తో బోయపాటి శ్రీను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే అఖండ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భారీ సినిమా వాయిదా పడటం అభిమానుల ఉత్సాహాన్ని తాత్కాలికంగా తగ్గించింది. అయితే, మేకర్స్ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని, ఆ రోజు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 'అఖండ 2' కొత్త రిలీజ్ డేట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ ఆలస్యం సినిమాపై అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది.

ఫైనాన్స్ సమస్యలు క్లియర్ అయ్యాయని లీగల్ సమస్యలు కూడా  క్లియర్ అయితే సినిమా రికార్డులు క్రియేట్ చేయడం  పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖండ2 సినిమాకు  120 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: