నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’ . ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేశారు అనేది అందరికి తెలిసిందే. అయితే విడుదల అనుకోకుండా వాయిదా పడింది. ఈ సడన్ డెసిషన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ, అసహనం కలిగించింది. కొంత మంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గత చిత్రాల నుంచి ఉన్న ఆర్థిక బాకీలు, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ కారణంగా నిర్మాతలు ఈ సమస్యలను ముందుగా క్లియర్ చేసుకోవాల్సి రావడంతో విడుదలను నిలిపివేయక తప్పలేదు. ఇప్పటికే భారీ హైప్ తీసుకొచ్చిన ఈ చిత్రాన్ని చూడాలని ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు ఈ నిర్ణయం పెద్ద షాక్‌గా మారింది. సోషల్ మీడియాలో దీన్నే హైలెట్ చేస్తున్నారు జనాలు.


ఇక ఇదే దారిలో మరో సినిమా కూడా వస్తుంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.  కార్తీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది అంటూ టాక్. నిర్మాత చెల్లించాల్సిన బాకీలను తీర్చకుండానే రిలీజ్‌కు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో, బాధితులు కోర్టును ఆశ్రయించడంతో విషయం చట్టపరమైన దశకు చేరింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ చిత్ర విడుదలపై తాత్కాలిక స్థగిత విధించింది అని తెలుస్తుంది. దీంతో సినిమా రిలీజ్ పూర్తిగా అయోమయంలో పడింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 8కు వాయిదా పడింది.



ఈ రెండు చిత్రాలకు వరుసగా జరుగుతున్న ఈ సమస్యలు సినిమా ఇండస్ట్రీలో విశేష చర్చనీయాంశంగా మారాయి. భారీ బడ్జెట్లతో చిత్రాలను నిర్మిస్తున్న సమయంలో నిర్మాతలు తమ ఫైనాన్షియల్ ప్లానింగ్, బాకీల క్లియరెన్స్, కాంట్రాక్టు బాధ్యతలు వంటి విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సినిమా ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి.ఇప్పుడీ రెండు సినిమాల భవిష్యత్తు ఏ దిశలో మలుపు తిరుగుతుందో, విడుదల ఎప్పుడు జరుగుతుందో చూడాలి. అభిమానులు మాత్రం తమ ఇష్ట నటుల సినిమాలు త్వరగా థియేటర్లలో దర్శనమివ్వాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: