లోపలి సమాచారమంటే, సినిమా మీద ఉన్న అన్ని లీగల్ ఇబ్బందులు, ఫైనాన్షియల్ సమస్యలు దాదాపు సాల్వ్ అయ్యాయట. కానీ సమస్యలు క్లియర్ అయిన వెంటనే సినిమా రిలీజ్ చేస్తారా అంటే? అదీ లేదట.మేకర్స్ ప్రస్తుతానికి విడుదలకు కొత్త డేట్స్‌ను పరిశీలిస్తున్నారని టాక్. సంక్రాంతి, లేదా డిసెంబర్ 12, లేకపోతే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 రిలీజ్‌ను కూడా సీరియస్‌గా కన్‌సిడర్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్‌లో చర్చ మొదలైంది.అయితే సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అది బాలయ్య సైలెన్స్ గురించిందే. అసలు ఇంత పెద్ద ఇష్యూ అయ్యింది… అయితే బాలయ్య ఎందుకు మాట్లాడలేదు?“ఈ ఇష్యూ జరుగగానే బాలయ్య మీడియా ముందు వచ్చి గట్టిగా స్పందిస్తారు, అసలే వదిలిపెట్టరు.”కాని అందరి అంచనాలకు విరుద్ధంగా బాలయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి ఈ అంశంపై ఆయనకు తీవ్ర అసహనం ఉన్నట్టే అనిపిస్తున్నా… పబ్లిక్‌గా మాత్రం పూర్తిగా సైలెంట్.
బాలయ్య సైలెన్స్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి?
ఫిల్మ్ నాగర్ టాక్, ఫ్యాన్స్ అభిప్రాయాలు, బాలయ్య వ్యక్తిత్వం—ఇవి మొత్తం కలిపి చూస్తే మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి:
1. "ప్రతి పరిస్థితిలో కోపమే పరిష్కారం కాదు" అనేది బాలయ్యకు బాగా తెలుసు: బాలయ్యకి —అభిమానుల ప్రేమ, ఎక్కడపడితే అక్కడ కలెక్షన్స్ తెచ్చే స్టార్ పవర్, రాజకీయాల్లో ప్రభావం, ఇండస్ట్రీలో ఉన్న సీనియారిటీ… అన్నీ టాప్‌లోనే ఉంటాయి.అతను కోపంతో స్పందించి ఉంటే ఒత్తిడిని పెంచి, ఇష్యూ మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఆయన సైలెన్స్‌ను స్ట్రాటజీగా వాడుకున్నారని చర్చ.
2. "సినిమా బాగానే విడుదలైతే… అందరికీ మంచి జరుగుతుంది" అన్న ఆలోచన: బాలయ్యకు సినిమా అంటే కేవలం హీరోయిజం, రికార్డులు కాదు.అతని మాటల్లో — “సినిమా అంటే వేలాది మంది కార్మికుల రోజువారి జీవనం.”ఇంత పెద్ద ప్రాజెక్ట్ డిలే అవ్వడం వల్ల టెక్నీషియన్‌లు, ఫైనాన్స్ టీమ్, డిస్ట్రిబ్యూటర్లు అందరూ నష్టపోతారు. అందుకే రాధాంతం చేయకుండా, “పరిస్థితి క్లియర్ అవ్వాలి… తరువాత రిలీజ్ అనేది ఎవరికి మేలు” అని ఆయన భావిస్తున్నారట.ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ కూడా పెద్దఎత్తున పంచుకుంటున్నారు.
3. బాలయ్య వద్ద ఉన్న రాజకీయ, ఇండస్ట్రీ మద్దతు వల్ల… ఆయనే చేస్తే ఏదైనా సాధ్యమే: బాలయ్యకు ఉన్న పరిధి, రాజకీయాల నుండి ఇండస్ట్రీ వరకు ఉన్న పలుకుబడి చూస్తే ఈ ఇష్యూ ఒకరోజులోనే రిజాల్వ్ చేయించే శక్తి ఉంది.
కానీ ఆయన అలా చేయలేదు.అదే ఆయన మంచితనం.పవర్ ఉన్నప్పటికీ దాన్ని తప్పు దారిలో వాడకపోవడం ఇంకా ప్లస్ పాయిట్ అయ్యింది. ఇది ఆయన నిజమైన వ్యక్తిత్వం అని చాలామంది చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి