తాజాగా ఆమె తన తల్లి నినెట్ ప్రభుతో కలిసి దిగిన ఓ అందమైన ఫోటోను పంచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. తల్లి పక్కన నిలబడి ఉన్న సమంత ముఖంలో కనిపించిన ప్రశాంతత, తాజాదనం, జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకున్న ఆనందం — ఇవన్నీ ఆ ఒక్క ఫోటోలోనే స్పష్టంగా కనిపించాయి. అభిమానులు ఆ ఫొటోపై ప్రేమల వర్షం కురిపిస్తున్నారు.ఇవన్నీ జరుగుతున్నప్పటికీ, సమంత కెరీర్ వైపు కూడా మరింత దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. పెళ్లి, వ్యక్తిగత మార్పులు, ప్రయాణాలు — ఎన్ని ఉన్నా కూడా ఓ నటిగా తన బాధ్యతను మాత్రం ఆమె విస్మరించలేదు.
ఇక ఇటీవల సమంత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పుల గురించి ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టింది. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రేమాభిమానాల మధ్య… గత ఏడాదిన్నరగా నా కెరీర్‌లో చాలానే రిస్క్‌లు తీసుకున్నాను. ధైర్యంగా ముందడుగులు వేశాను. జీవితం నన్ను ఎన్నో పాఠాలు నేర్పించింది. ఎదగడానికి, మారడానికి, ధైర్యంగా ముందుకు సాగడానికి ఇది కేవలం ఆరంభమే’’ అని పేర్కొంది.ఈ పోస్ట్‌తో పాటు భర్త రాజ్ నిడిమోరుతో ఉన్న ఒక ప్రత్యేక ఫోటోను కూడా షేర్ చేసింది. ఆ ఫోటోలో కనిపించిన కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్, కొత్త జీవితంపై వారి ఉత్సాహం—అన్నీ అభిమానులను మరింత సంతోషపెట్టాయి.మొత్తానికి, సమంత పెళ్లి తర్వాత వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా పూర్తిగా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసింది. తన జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తూ, మాటల్ని పక్కన పెట్టి, ముందున్న అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఆమె షేర్ చేస్తున్న ప్రతి ఫోటో, ప్రతి పోస్ట్ కూడా ఆమె ఇప్పుడు ఎంత ధైర్యంగా, ఎంత సంతోషంగా ముందుకు సాగుతోంది అనేది స్పష్టంగా చెబుతోంది. అయితే కొంత మంది ఇది రివేంజ్ గా షేర్ చేసింది అంటునారు. సమంత కావాలనే తన ఆనందపు మూమెంట్స్ ని ఈ విధంగా షేర్ చేసింది అని ఘాటుగా స్పందిస్తున్నారు. కానీ ఫ్యాన్స్ కామెంట్స్‌లో ఒకే మాట అంటున్నారు…"సమంత రివెంజ్ కాదు… రీ-స్టార్ట్ చేసుకుంది!"
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి