ప్రస్తుతం మెగా కాంపౌండ్‌లో ఉన్న స్టార్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత అవైటెడ్ చిత్రం “పెద్ది” గురించి సినీప్రియులందరికీ తెలిసిందే. మంచి అంచనాలు, భారీ హైప్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమాను ప్రతిభావంతుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ భావోద్వేగాలు, సంగీతం, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిసిన ప్యాన్-ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు ఇప్పటి వరకూ నిర్మాతలు ఇచ్చిన సిగ్నల్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.


ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్ రిలీజ్ చేయాలని ముందుగానే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ రిలీజ్‌కు ఒక రోజు ముందే “ది పరడైజ్’’ అనే మరో చిత్రం కూడా రానుంది. అందువల్ల చిన్నపాటి క్లాష్ వెలుగులోకి వస్తుందనే భావన అప్పుడే క్రియేట్ అయ్యింది. అయితే ఇప్పుడు పరిస్థితులు ఇంకా ఆసక్తికరంగా మారాయి.ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్’’ కూడా మార్చి  చివరి వారంలో విడుదల కానుందని టాలీవుడ్ సర్కిల్‌లో పలు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేస్తారని సినిమా యూనిట్ ఇంతకుముందే చెప్పింది. కానీ మళ్లీ మార్చి ఎండ్ టార్గెట్ చేస్తున్నారని కొన్ని మీడియాలో కథనాలు ఎక్కువయ్యాయి.


దీంతో రామ్ చరణ్ “పెద్ది’’కి పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్’’ డైరెక్ట్ క్లాష్ అవుతాయనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో అయితే ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. పవన్ వర్సెస్ చరణ్ అనే కోణంలో అభిమానులు కూడా చర్చలు మొదలుపెట్టారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందన్నదే అసలు ప్రశ్న. సినీ వర్గాలు చెబుతున్నదేమంటే—రియాలిటీ పరంగా చూస్తే ఈ రెండు భారీ సినిమాలు ఒకేసారి విడుదల కావడం దాదాపుగా అసాధ్యం. బాక్సాఫీస్‌పై ప్రభావం పడుతుందన్న సంగతి పక్కన పెట్టినా, ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన హీరోలు కావడం, పైగా ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థలూ ఒక్కటే కావడం వల్ల అంతర్గతంగా కూడా ఎవరూ అలాంటి రిస్క్ తీసుకునే అవకాశం లేదు.


ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇదే చెబుతోంది. రెండూ భారీ బడ్జెట్ సినిమాలు. అలాంటి భారీ ప్రాజెక్టులు ఒకేసారి విడుదలైతే కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు, స్క్రీన్ అలొకేషన్ నుంచి మార్కెటింగ్ వరకూ చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి నిర్మాతలు ఆ లెక్కలు తప్పకుండా చూసుకుంటారు. అందువల్ల ప్రస్తుతం బయటికి వినిపిస్తున్న “మెగా క్లాష్’’ అనే మాట పూర్తిగా ఊహాగానం మాత్రమే. అభిమానులు సృష్టిస్తున్న మైండ్ గేమ్ మాత్రమే తప్ప అసలు గ్రౌండ్‌లో అలాంటి విషయం జరిగే అవకాశమే చాల తక్కువ. కాబట్టి ఎవరికైతే మెగా హీరోల మధ్య క్లాష్ పడుతుందని ఎదురు చూపులు ఉన్నాయో, వాళ్లు ఇప్పుడే ఆ ఆశలు వదిలేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇటువంటి క్లాష్‌లు బయట నుండి జనరేట్ అయ్యే హైప్ మాత్రమే కానీ నిజ జీవితంలో జరుగుతాయన్న గ్యారంటి అస్సలు ఉండదు. సో మొత్తంలో చెప్పాలి అంటే—“పెద్ది’’ వర్సెస్ “ఉస్తాద్ భగత్ సింగ్’’ క్లాష్ కథనే అసలు నిజం కాకపోవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: