ఈ సినిమా తర్వాత అఖిల్ కొంత గ్యాప్ తీసుకుని, తాను తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న సినిమా ‘లెనిన్’. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. అక్కినేని నాగార్జునతో పాటు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన అప్ డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అఖిల్ లుక్, పాత్ర ప్రెజెంటేషన్ చాలా ఇంటెన్స్ గా ఉండడం వల్ల సినిమా గురించి అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పుడొస్తున్న తాజా సమాచారం ప్రకారం, ‘లెనిన్’ తర్వాత అక్కినేని అఖిల్, పాన్ ఇండియా సెన్సేషన్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన ఈ దర్శకుడితో అఖిల్ కాంబినేషన్ నిజమైతే, ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని సినీ వర్గాల అభిప్రాయం. ఇటీవల అఖిల్, ప్రశాంత్ నీల్‌ను వ్యక్తిగతంగా కలిసినట్లు వార్తలు రావడంతో, ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. దీంతో అఖిల్ అభిమానుల్లో మంచి ఉత్సాహం నెలకొంది.
అయితే ఈ ప్రాజెక్ట్ గురించి నిజమైన వివరాలు తెలియాలంటే, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. అప్పటి దాకా ఈ వార్తను రూమర్‌గానే తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా, ‘లెనిన్’తో అఖిల్ మార్కెట్ మళ్లీ పెరిగి, ప్రశాంత్ నీల్ చిత్రం స్టార్ట్ అయితే, ఆయన కెరీర్‌లోనే అత్యంత ముఖ్యమైన మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయన్న మాట మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి