సంక్రాంతి సమయంలో విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో విక్టరీ వెంకటేశ్ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన వెంకటేశ్, ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పైనా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉంటే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవిఅనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రంలో వెంకటేశ్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారని అందరికి తెలిసిందే.
 .

చిరంజీవి – వెంకటేశ్ ఇద్దరు అగ్ర హీరోలు ఒకే చిత్రంలో కలిసి కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రం గురించి అభిమానుల్లో మరింత ఆసక్తి, హైప్ పెరిగింది. త్రివిక్రమ్ చిత్రంతో పాటు చిరంజీవి సినిమాకు అతిథి పాత్ర అంటేనే వెంకటేశ్ అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఈ రెండు చిత్రాల తర్వాత వెంకటేశ్–అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌తో వెంకటేశ్ సినిమా పూర్తవగానే, మరొకవైపు అనుదీప్ – విశ్వక్ సేన్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ కొత్త కాంబినేషన్ పనులు ప్రారంభం కానున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. .



అనుదీప్‌ సినిమాలు సాధారణంగా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యతనిచ్చేలా ఉంటాయి. అలా కావడంతో వెంకటేశ్‌కు ఈ జానర్ బాగానే నప్పుతుందని కూడా పరిశ్రమలో చర్చ జరుగుతోంది. .ఈ చిత్రంలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తారని బలమైన సమాచారం బయటకు వచ్చింది. . ఇప్పటికే అనుదీప్ కథను రష్మికకి వినిపించారనీ, ఆమె కూడా కథను ఆసక్తిగా విని సానుకూలంగా స్పందించిందన్న టాక్ వినిపిస్తోంది.అయితే, ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..!?

మరింత సమాచారం తెలుసుకోండి: