విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, ప్రతిష్టాత్మక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసిన ‘కింగ్డమ్’ సినిమా మొదటి నుంచే రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాణ సంస్థ ఎంతో పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించగా, స్టార్ కాస్టింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్, సెట్స్, విజువల్ ప్రెజెంటేషన్—అన్ని ఒక గ్రాండ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఉద్దేశించారు. ప్రకటన జరిగిన రోజునుంచే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలోనూ, ట్రేడ్ సర్కిల్స్‌లోనూ ఈ సినిమా గురించి అనేక చర్చలు జరిగాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా నిలుస్తుందనే ఎదురుచూపుల్లో అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూశారు. అయితే విడుదల రోజు నుంచే సినిమా ఆశించిన స్థాయిలో పాజిటివ్ స్పందనను సొంతం చేసుకోలేకపోయింది.


కథనం నెమ్మదిగా ఉండటం, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు మాస్ కనెక్ట్ రాకపోవడం, కొన్ని చోట్ల నేరేషన్ స్టైల్ వర్కౌట్ కాకపోవడం వంటి కారణాల వల్ల అనూహ్యంగా నెగిటివ్ టాక్ మొదలైంది. రిలీజ్ అయిన రెండో రోజు నుంచే రివ్యూలు, పబ్లిక్ రెస్పాన్స్‌ దాదాపుగా నెగిటివ్ వైబ్ ఒదిగిపోవడంతో, బాక్సాఫీస్ రన్‌పై తీవ్ర ప్రభావం పడింది.భారీ స్కేల్లో నిర్మించబడిన ఈ చిత్రానికి పెట్టిన మొత్తాన్ని తిరిగి సంపాదించడమే కాకుండా, కనీస రికవరీ కూడా సాధించలేకపోయిందనే టాక్ పరిశ్రమలో వినిపిస్తోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం, సినిమా తొలి వారాంతానికే కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. దాంతో చాలా తక్కువ రోజుల్లోనే మల్టీప్లెక్స్‌లు, థియేటర్‌ల నుంచి సినిమా తొలగించబడినట్టు సమాచారం.ఇదంతా నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


‘కింగ్డమ్’ మొదటి భాగం విడుదలకు ముందే రెండో భాగం (‘కింగ్డమ్ 2’) కోసం ప్రీ–ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్, విజువల్ డిజైన్ వంటివి మొదలయ్యాయని టాక్ వినిపించింది. దర్శకుడు కూడా ఇంటర్వ్యూల్లో సీక్వెల్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి భాగం ఫలితం నిరాశపర్చడంతో నిర్మాణ సంస్థ మళ్లీ భారీ పెట్టుబడులు పెట్టడానికి సై అంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ‘కింగ్డమ్ 2’ పని పూర్తిగా హాల్ట్‌లో ఉందని తెలుస్తోంది.



విజయ్ దేవరకొండ అభిమానులు ‘కింగ్డమ్ 2’ను బిగ్ మూవీగా ఎదురు చూస్తూ సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ పట్టాలెక్కకపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే భావన అభిమానుల్లో గట్టి నిరాశను కలిగిస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన ‘కింగ్డమ్’ వాణిజ్య పరంగా పెద్ద సక్సెస్ అందుకోలేకపోవడం, ముఖ్యంగా స్టూడియో నష్టాల్లోకి వెళ్లడం వల్ల రెండో భాగం భవిష్యత్తు చాలా అన్నిశ్చితంగా మారిపోయింది.ఇప్పటి పరిస్థితులను చూస్తే ‘కింగ్డమ్ 2’ ఎప్పుడు మొదలవుతుందో? అసలు మొదలవుతుందో లేదో అనేదే పెద్ద ప్రశ్నగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: