దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న నటి రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. ఆమె నటన, అందం, అందుకు తోడు తన హార్డ్ వర్క్‌ కారణంగా, నేటి తరం హీరోయిన్లలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న అరుదైన టాలెంట్‌గా రష్మిక నిలిచింది. సోషల్ మీడియాలో రష్మికకు ఉన్న ఫాలోయింగ్ ప్రస్తుతం నేషనల్ రేంజ్‌ దాటి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయింది. ప్రతి సినిమా విడుదల సమయంలో ఆమెకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌లు సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతుండటం దీనికి పెద్ద ఉదాహరణ.


ఇటీవలి కాలంలో రష్మిక నటించిన సినిమాలు వరుస విజయాలను అందుకుంటున్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడం ద్వారా ఆమె కెరీర్ మరింత వేగం పుంజుకుంటోంది. ఈ విజయాలన్నింటికీ కారణం ఆమెలో ఉన్న డెడికేషన్, పాత్రల కోసం చేసే కష్టమే అని అభిమానులు, సినీ విమర్శకులు చెబుతున్నారు. పాత్ర కోసం ఎంత కష్టపడాలో రష్మిక తన పనితీరుతో నిరూపించుకుంటోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందనకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అందాల ముద్దుగుమ్మ రష్మిక మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, నటి ప్రత్యూష బయోపిక్‌లో రష్మిక మందన్నాను ప్రధాన పాత్రకు ఎంపిక చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ప్రత్యూష బయోపిక్ గురించి ఎన్నో చర్చలు జరిగినా, ఆ ప్రాజెక్ట్‌ రాజకీయ సమస్యలు, వివాదాల కారణంగా ఎప్పటికప్పుడు ఆగిపోతూనే వచ్చింది. కొన్ని సార్లు షూట్ స్టార్ట్ అయ్యిందని రూమర్స్ వచ్చినప్పటికీ, అమలులో మాత్రం పెద్దగా ఏమీ జరగలేదు.



అయితే ఇప్పుడు తిరిగి ఈ బయోపిక్‌పై సీరియస్‌గా వర్క్ జరుగుతోందని, ముఖ్యంగా రష్మిక ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపడంతో సినిమా మీద మళ్లీ భారీ హైప్ ఏర్పడిందని టాక్. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో “ప్రత్యూష బయోపిక్‌లో రష్మిక మందన ప్రధాన పాత్ర” అనే వార్తలు జెట్ స్పీడ్‌తో వైరల్ అవుతున్నాయి. రష్మిక తన కెరీర్‌లో మరోసారి చరిత్రాత్మకమైన పాత్రను పోషించబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.స రష్మిక కన్ఫర్మ్ అయితే ఈ బయోపిక్‌ దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీయొచ్చు. ఎందుకంటే ప్రత్యూష కథ ఒక్క వ్యక్తి జీవిత కథ మాత్రమే కాదు, అది ఒక కాలం, ఒక పరిస్థితిని ప్రతిబింబించే సంఘటన. అలాంటి పాత్రను రష్మిక పోషిస్తే, ఆమె కెరీర్‌ను పూర్తిగా నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.



అధికారిక అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, రష్మిక అభిమానులు మాత్రం ఈ వార్తలపై భారీ ఎక్సైట్మెంట్‌తో స్పందిస్తున్నారు. కొత్తగా రాబోయే ప్రాజెక్టుల ఎంపికలో రష్మిక చూపుతున్న తెలివితేటలు, వైవిధ్యం చూసి ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్ అవసరమా..? అంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: