పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలిసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ కోసం ముంబైలో ఓ భారీ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ రూపొందించబడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నారట.


ఈ సెట్లోనే ప్రభాస్ ఎంట్రీ కోసం ప్రత్యేకంగా ఒక మాసివ్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు టీమ్ ప్రణాళికలు వేస్తోందని తెలుస్తోంది. ఈ పాటలో ప్రభాస్‌తో పాటు మరో ప్రముఖ హీరోయిన్ కూడా కనిపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంట్రీ సాంగ్ షూట్ పూర్తయ్యిన వెంటనే కీలక యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్లు మొత్తం సినిమాలోనే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని, వాటి కోసం ప్రత్యేక యాక్షన్ కొరియోగ్రఫీ, అత్యాధునిక టెక్నిక్స్‌ వాడుతున్నారని సమాచారం. ఈ సెట్ కోసం ఏకంగా 17 కోట్లు ఖర్చు పెట్టారట మూవీ మేకర్స్.



ఇదిలాఉంటే, చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్‌ను సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సందీప్–హర్షవర్ధన్ కాంబినేషన్‌లో వచ్చే ఈ ఆల్బమ్ మాస్, ఇంటెన్స్ టోన్‌లో ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌ను టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రత్యేక సెట్స్ నిర్మాణానికే కోట్లు ఖర్చు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంకా, ‘స్పిరిట్’ కథాంశం కూడా పూర్తిగా నూతనంగా ఉండబోతుందని, సందీప్ రెడ్డి వంగా ఈసారి కూడా ఒక వినూత్న స్క్రీన్‌ప్లేను ప్రేక్షకులకు అందించబోతున్నారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ప్రతి రోజూ పెరుగుతున్నాయి. సందీప్ మరియు ప్రభాస్ కాంబినేషన్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో మరో బ్లాక్‌బస్టర్ సినిమాకి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: