ఈ సినిమాలో నీలాంబరి అనే పాత్రకు ఐశ్వర్య రాయ్ పూర్తిగా సరిపోతారని రజినీకాంత్ భావించారట. ఒక అందం, ఒక గౌరవం, పాత్రలో ఉండాల్సిన అహంకారం—అన్నీ ఆమె రూపంలో అద్భుతంగా కనిపిస్తాయని ఆయనకి అనిపించిందట.
అందుకే దర్శకుడు కె.ఎస్. రవికుమార్ గారికి కూడా అదే సూచన చేసినట్టు రజిని గుర్తుచేశారు. కానీ ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ చాలా బిజీగా ఉన్నారు. నవ నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాలు, అంతర్జాతీయ ప్రాజెక్టులు—ఇలా వరుసగా షూటింగ్స్ ఉండటంతో ఆమె డేట్స్ ఇవ్వడం అసాధ్యమవుతోంది అని దర్శకుడు రవికుమార్ రజినీకాంత్ కి చెప్పారట. “ఏమైనా పర్లేదు… రెండు మూడు సంవత్సరాలు అయినా ఎదురుచుద్దాం. ఈ పాత్ర ఆమెకే సరిపోతుంది,” అని రజిని నిర్ణయం తీసుకున్నారట. కానీ, ఆశించినట్టుగా జరగలేదు. కొన్ని రోజుల తరువాత ఐశ్వర్య రాయ్ ఈ పాత్ర చేయాలనే ఆసక్తి లేనట్టు చెప్పారట. దీంతో రజనీకాంత్ కూడా అప్పుడు అర్థం చేసుకుని, ఇకముందు మళ్లీ అదే విషయం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని వదిలేశారట.
ఐశ్వర్య రాయ్ తర్వాత మీనా, మాధురి దీక్షిత్ వంటి పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. అందం, నటన – అన్నిచోట్ల కూడా అగ్రస్థానంలో ఉన్న నటి వాళ్లిద్దరూ. కానీ నీలాంబరి పాత్రలో కావాల్సిన కళ్లలో కనిపించే “అహంకారం – పొగరు” మాత్రం కనిపించలేదని రజినీకాంత్ భావించారట.అందుకే వాళ్లను కూడా ఫైనలైజ్ చేయలేదు. ఒక రోజు షూటింగ్ ప్రాంగణంలో రజినీకాంత్ లిఫ్ట్‌లోకి వెళ్లబోతుండగా, ఎదురుగా రమ్యకృష్ణ నడుచుకుంటూ వస్తున్నారట. అప్పటి రమ్యకృష్ణ గ్లామర్, మెచ్యూరిటీ – ఆ కళ్లల్లో ఉన్న పవర్… రజినీకాంత్‌కు అచ్చం నీలాంబరి కనిపించిందట! అదే క్షణంలో – “ఇదే మన నీలాంబరి” అని సూపర్ స్టర్ ఫిక్స్ అయ్యారట.
హాస్యంగా రజినీకాంత్ చెప్పారు –“ఇంకో రెండు కేజీలు వెయిట్ పడి కనిపిస్తే అదుర్స్ అవుతుంది!” అని అన్నారట..కొన్ని వారాల్లోనే రమ్యకృష్ణ ఆ పాత్రకు అచ్చుగుద్దినట్లు తయారైపోయారు.చివరికి రమ్యకృష్ణ నీలాంబరిగా స్క్రీన్‌పై కనిపించినప్పుడు ప్రేక్షకులు మాటరాని స్థితిలోకి వెళ్లిపోయారు. నటన, లుక్, డైలాగ్ డెలివరీ… అన్నింటిలో కూడా రమ్యకృష్ణ అద్భుతంగా చేశారు. ఇప్పటికీ ఆమె నటించిన ఎన్నో సినిమాలున్నా ఈ పాత్రకు ఉన్న ప్రత్యేకత మాత్రం వేరేగా నిలిచింది. నీలాంబరి పాత్ర సీక్రేట్ ఇన్నాళ్లకి బయటపెట్టాడు రజనీకాంత్ అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి