రాజమౌళితో సినిమాలు చేసిన హీరోల్లో చాలా మందికి స్టార్ స్టేటస్ దక్కింది. కానీ అందరిలో ముగ్గురు హీరోల కెరీర్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ ముగ్గురు ఎవరో అంటే నితిన్, సునీల్, నాని.ఈ ముగ్గురి కెరీర్ గ్రాఫ్‌లో రాజమౌళి సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అయినా, తర్వాత ఎదురైన పరిస్థితులు పూర్తిగా వేరు.నితిన్‌కి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ ఒక మంచి మైలురాయి. సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ తర్వాత పరిస్థితి ఊహించని రీతిలో మారిపోయింది.రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుంది అనేది సాధారణ ట్రెండ్. కానీ నితిన్ విషయంలో మాత్రం ఇది ఒక భారీ డౌన్ అయిపోయింది. ‘సై’ తర్వాత వరుసగా 12 ఫ్లాప్ సినిమాలు రావడం టాలీవుడ్‌లోనే అరుదైన విషయంగా చెప్పాలి.ధైర్యం నుంచి ‘మారో’ వరకూ వచ్చిన ప్రతి సినిమా నిరాశపరిచింది. క్రేజ్ తగ్గి, ఆఫర్లు తగ్గి, ఒక దశలో నితిన్ కెరీర్ పూర్తిగా ముగిసిపోయిందనే మాట బయటపడింది.
ఇదంతా జరుగుతున్న సమయంలో నితిన్ చేసిన 'ఇష్క్' సినిమానే అతడికి నిజమైన రీ-ఎంట్రీ. ఆ సినిమా మాత్రమే కాకుండా, తర్వాత వచ్చిన 'గుండె జారి గల్లంతయ్యిందే', వరుస సక్సెస్‌లు అందుకుని మళ్లీ టాప్ యంగ్ హీరోల లిస్టులో చేరిపోయాడు. అదే సమయంలో ప్రజలు కూడా నితిన్‌ని మళ్ళీ సీరియస్‌గా చూడడం మొదలుపెట్టారు. అయితే మళ్ళీ ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయ్. నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలంటే భారీ హిట్ పడాల్సిందే..?!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి