ఇప్పటి సినిమా పరిశ్రమలో తరచూ వినిపించే ఒక ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే—ఒక హీరో పక్కన నటించే హీరోయిన్ వయస్సు. ప్రత్యేకంగా 50 ఏళ్ల పైబడ్డ స్టార్ హీరోలతో 25 ఏళ్ల యువ హీరోయిన్లు జంటగా కనిపిస్తే, ప్రేక్షకుల్లో ఒక వర్గం వెంటనే చర్చలు ప్రారంభిస్తుంది. “నిజ జీవితంలో ఇలాంటి వయసు తేడా ఉన్న జంటలు ఎంతమంది ఉంటారు?”, “ఇది చూసేలా ఉందా?” అని ప్రశ్నలు లేవదీయడం ఇప్పుడిప్పుడే సాధారణమైపోయింది. సోషల్ మీడియాలో అయినా, కామెంట్ సెక్షన్లలో అయినా ఈ డిబేట్ మాత్రం ఆగే ప్రసక్తి లేదు.


తాజాగా ఈ హాట్ టాపిక్‌పై కోలీవుడ్ హీరో కార్తీ స్పందించారు. తన రాబోయే చిత్రం ‘అన్నగారు వస్తారు’ ప్రమోషన్లలో పాల్గొన్న కార్తీ, హీరో–హీరోయిన్ల వయస్సు తేడాపై వచ్చిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. వయసు గ్యాప్ గురించి విమర్శలు వినిపిస్తుండటంపై స్పందించిన కార్తీ, “ఇలా వయసు గురించి ఆలోచిస్తే... మనం సినిమాలు తీసే అవసరమే ఉండదు. సినిమా అంటే పాత్రలు. ప్రేక్షకులు కూడా ఆ పాత్రలను చూసే ప్రయత్నం చేయాలి కానీ నటుల నిజమైన వయసులను కాదు,” అంటూ స్పష్టంగా చెప్పారు.అయితే కార్తీ మాటలు అందరికీ నచ్చలేదు. కొంతమంది కార్తీ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తూ—“సినిమా అంటే నమ్మకం. పాత్ర బాగా కన్విన్స్ చేస్తే వయసు ఎంతైనా పర్వాలేదు” అంటున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం తెరపై కనిపించే జంట మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే, కెమిస్ట్రీ పక్కా కనెక్ట్ కాకపోవడం వల్ల ప్రేక్షకులకు అసౌకర్యంగా అనిపిస్తుందని వాదిస్తున్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, భిన్నాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది కార్తి ని కూడా నెగిటిబ్ గా మాట్లాడుతున్నారు. కార్తీ ఎప్పుడు ఇలా మాట్లాడడు బహుశా మందు కొట్టి మాట్లాడాడా ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మాటలు అసలు కార్తి నోట రానే రావు..అంటూ మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు.



ఇక ‘అన్నగారు వస్తారు’ విషయానికి వస్తే—ఈ చిత్రాన్ని నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తీ హీరోగా, యువ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి నాయికగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీ, డ్రామా, యాక్షన్ కలగలిసిన ఈ చిత్రం డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు—అన్ని మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కార్తీ–కృతి శెట్టి జంట ఎలా కనెక్ట్ అవుతారు? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారు? అన్నదానికి ప్రస్తుతం పెరిగిన ఆసక్తి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: