ప్రస్తుతం ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, మార్చ్ 19 లేదా మార్చ్ 26 తేదీల్లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని పలువురు సినీ వర్గాలు చెబుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ ఒక్కరోజులోనే అంత స్పీడ్‌గా పాపులర్ అయ్యేలా వైరల్ అయ్యాయి, ఫ్యాన్స్ కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయే స్థాయికి చేరాయి.అయితే ఈ రెండు తేదీల్లో ఏదైనా ఒకటి ఫిక్స్ అయినా, బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదు. మార్చ్ 19 అయితే… అదే రోజున ‘టాక్సిక్’ కూడా రాబోతున్నట్టు టాక్ ఉంది. ఇది వస్తే ట్రేడ్ లో టెన్షన్ మామూలుగా ఉండదు. మార్చ్ 26 తీసుకున్నా… అప్పటికే ‘ది పారడై, పెద్ది" లాంటి సినిమాలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రిలీజ్ డేట్‌ను మార్చడం, మార్చకపోవడం రెండూ మేకర్స్‌కి పెద్ద చాలెంజ్‌గా మారాయి.
మరొక వైపు ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక క్లారిటీ కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇచ్చిన పాత్ర, గెట్-అప్, లుక్, యాక్షన్ అన్నీ సూపర్ రేంజ్‌లో ఉండబోతున్నాయన్న నమ్మకం వాళ్లలో ఉంది. దానికితోడు హరీష్ శంకర్ స్టోరీటెల్లింగ్ స్టైల్, డైలోగ్స్, మాస్ ఎలిమెంట్స్—అన్ని ఈ సినిమాతో పవన్ మళ్ళీ ఒక భారీ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకం. ఇవన్నీ కలిపి చూస్తే…‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ నిజంగా మార్చ్‌కే షిఫ్ట్ అవుతుందా? లేక ఎప్పటిలాగే ఏప్రిల్‌కే వస్తుందా? ఈ ప్రశ్నకు ఇంకా అధికారిక సమాధానం రాలేదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్—రిలీజ్ డేట్ ప్రకటించే తరుణం వచ్చినప్పుడే టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా షేక్ అవ్వడం ఖాయం! ఫ్యాన్స్‌కి మాత్రం అప్పటి వరకూ ఈ కొత్త టెన్షన్ తప్పదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి