ఇలాంటి క్రూషియల్ మోమెంట్‌లో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న కమెంట్లు మాత్రం వేరే లెవెల్‌లో వైరల్ అవుతున్నాయి. “తొడకొట్టిన మీసాలు మెలివేసినా బాలయ్యని ఎవరూ ఆపలేరు”, “ఎంతమంది అడ్డం వచ్చినా ఇండస్ట్రీని ఈసారి దబిడి దిబిడి చేసేస్తాడు”, “మీసాలు ఒక్కసారి మెలివేసాడు అంటే స్క్రీన్ షేక్ అవుతుందిలే బాస్!” అంటూ ఫ్యాన్స్ తమదైన మాస్ స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు. అయితే చాలామంది బాలయ్య స్క్రీన్‌పై మీసాలు మెలివేసే ప్రతి సీన్‌ను సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు బాలయ్య సినిమా వేళ్ల మేము మీసాలు మెలివేయడానికి సిద్ధంగా ఉన్నం అంటూ పోస్టులు చేస్తున్నారు. “అవి కేవలం మీసాలు కావు… పవర్‌కి సింబల్… ఆ మెలివేసే కిక్‌ను సరదాగా కాదు, థియేటర్‌లో ఎంజాయ్ చేయాలి” అంటూ సినిమాటిక్ డైలాగ్‌లా కామెంట్లు పెడుతున్నారు.
అఖండ 2 రిలీజ్‌కి ఇంకా కొద్దిగంటలే ఉండడంతో, ఫ్యాన్స్ ఎమోషన్, హైప్, మాస్ వైబ్అన్ని సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే, బాలయ్య మళ్లీ ఒకసారి థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి