‘అఖండ’ సినిమాతో బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌గా వస్తున్న‘అఖండ 2’పై ఉన్న అంచనాలు.. ఆ సినిమాను మించి ఉన్నాయి.హైప్ మామూలుగా లేదు: ‘అఖండ 2’ టైటిల్ అనౌన్స్‌మెంట్, రిలీజ్ డేట్ ప్రకటనతోనే.. సినిమాపై ఉన్న హైప్ ఆకాశాన్ని తాకింది. ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో, థియేటర్ల దగ్గర మాస్ ఎలివేషన్స్‌తో సందడి మొదలుపెట్టారు. బాలయ్య పవర్, బోయపాటి టేకింగ్‌తో ఈ సీక్వెల్ బిగ్గెస్ట్ విధ్వంసం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డిసెంబర్ బ్లాక్ బస్టర్ ట్రెండ్: బాలకృష్ణకు డిసెంబర్ నెల ఎప్పుడూ మాస్ సెంటిమెంట్‌ను కలిగి ఉంటుంది. ఈ నెలలో ఆయన సినిమాలు చాలా వరకు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ‘అఖండ 2’ కూడా అదే బ్లాక్ బస్టర్ ట్రెండ్‌ను కొనసాగించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.1000 కోట్ల విజన్: ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ‘అఖండ’ పవర్, బ్రాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ సినిమా ద్వారా 1000 కోట్ల టర్నోవర్ సాధించాలనే బిగ్గెస్ట్ విజన్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మాస్ ప్లానింగ్ చూస్తే.. సినిమా స్కేల్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు!
‘అఖండ 2’ విడుదల రోజున బాక్సాఫీస్‌పై సునామీ సృష్టించడం ఖాయం! బాలయ్య నుంచి రాబోయే ఈ మాస్ ఫైర్ కోసం అభిమానులు పూనకాలతో ఎదురుచూస్తున్నారు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి