టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం అఖండ 2 . ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. నిజానికి అన్ని ప్లానింగ్‌ ప్రకారం జరిగి ఉంటే సినిమా డిసెంబర్ 5ననే గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈ ఆలస్యం కూడా ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచేసింది. అంతకుముందు నుంచే బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “ఎప్పుడెప్పుడు థియేటర్‌కి వెళ్లి చూస్తామా?” అంటూ ఎదురు చూశారు. మరి ఇప్పుడు ఆ వేచి ఉన్న రోజులన్నింటికీ ముగింపు పలుకుతూ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్‌ను దక్కించుకుంది. ఫస్ట్ షో నుండి హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌, బాలయ్య ఎనర్జీ, బోయపాటి మాస్ టేకింగ్—ఇవన్నీ కలిసి ఓ మారు మారణాయుధంలా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.


ఇక సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చలు ఊపందుకుంటూ సాగుతున్నాయి. ప్రత్యేకంగా హీరోయిన్ సంయుక్త నటన గురించి నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలయ్యకు సరితూగే స్క్రీన్ ప్రెజెన్స్‌, ఎమోషన్స్‌, లుక్స్ అన్నింటిలోనూ ఈ సినిమాలో ఆమె మంచి ఫిట్ అయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. అందులో భాగంగా, “సంయుక్త  బాగానే చేసింది… కానీ ఆ పాత్రలో నయనతార ఉంటే ఇంకా వేరే లెవెల్‌లో సినిమాకి రేంజ్ పెరిగిపోయేది,” అని కామెంట్లు చేస్తున్నారు కొంతమంది నెటిజెన్స్. బాలయ్యనయనతార కాంబినేషన్ ఎప్పుడూ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని, ఇద్దరి కెమిస్ట్రీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని, అలాంటప్పుడు అఖండ 2లో కూడా నయనతార నటించి ఉంటే సినిమా హైలైట్ మరింత భారీగా ఉండేదని చర్చిస్తున్నారు.



ఇకపోతే, ఈ కామెంట్లపై బాలయ్య అభిమానులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “సంయుక్త కూడా రోల్‌కు న్యాయం చేసింది… కథకు ఏది సరిపోతుందో అదే తీసుకున్నారు,” అంటున్నారు కొందరు. మరికొందరు మాత్రం “నయనతార అయితే అటెన్షన్ లెవెల్ మిగతా ఇండస్ట్రీస్‌లో కూడా మరింత పెరిగేది… పాన్ ఇండియా హైప్ ఇంకాస్త పెరిగేదేమో,” అని మద్దతు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: