ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్‌ని చూస్తే ఎవ్వరికైన ఇదే అనిపిస్తుంది.  “బోయపాటి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉండి ఉంటే సినిమా ఎంత బాగుండేదో!” అంటూ బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. నందమూరి బాలయ్యబోయపాటి శ్రీను కాంబినేషన్‌ అంటే టాలీవుడ్‌లో ప్రత్యేక క్రేజ్  అందుకే అఖండ సిరీస్‌పై ప్రేక్షకుల అంచనాలు సగటు స్థాయి కంటే ఎప్పుడూ చాలా ఎక్కవ.ఈసారి అఖండ 2 అనౌన్స్ అయ్యిన రోజు నుంచే బాలయ్య ఫ్యాన్స్‌లో హైప్ ఆకాశాన్ని తాకింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా… థియేటర్‌లో ఎప్పుడు ఎంజాయ్ చేస్తామా… అంటూ అభిమానులు రోజులు లెక్కపెట్టుకుంటూ ఎదురుచూశారు. ఎన్నో ఒత్తిళ్లు, అడ్డంకులు, అన్‌ఎక్స్పెక్టెడ్ పరిస్థితుల మధ్య సినిమా మొదట ప్లాన్ చేసిన తేదీకి రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
 

తర్వాత సోషల్ మీడియాలో సినిమా చుట్టూ కొంత నెగిటివిటీ కూడలిలా చేరినట్లైంది.అయితే చివరికి అన్ని అడ్డంకులను దాటి, అఖండ 2 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలైన వెంటనే వచ్చిన పాజిటివ్ టాక్ మాత్రం వేరే రేంజ్‌లో ఉంది. బాలయ్య గారు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్, బోయపాటి స్టైల్లో రూపొందిన మాస్ యాక్షన్ సీన్స్, అఘోర పాత్రలో బాలయ్య చూపించిన ఇంటెన్సిటీ — ఇవన్నీ ప్రేక్షకులను పండగ చేసాయంటే అతిశయోక్తి కాదు. ఫస్ట్ షో నుండి  హౌస్‌ఫుల్ హడావిడి కొనసాగుతూనే ఉంది.



అయితే అభిమానులు చెబుతున్న ఆ “ఒక్క మిస్టేక్” ఏంటి అంటే…ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ప్రకారం, సినిమా అసలు అనుకున్న తేదీ డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయి ఉండి ఉంటే, అఖండ 2కి జీరో నెగిటివిటీ ఉండేదట. అనుకోని వాయిదా కారణంగా “సినిమా ఎందుకు ఆగిపోయింది?”, “ఎందుకు రిలీజ్ కాలేదు?” అనే చిన్న చిన్న నెగిటివ్ టాక్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. సినిమాకు వచ్చిన చిన్న నెగిటివ్ వైబ్ వల్ల కొన్ని వర్గాల్లో అవసరం లేని రాధాంతాలు కూడా జరిగాయి.



ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే…“బాలయ్య – బోయపాటి ముందుగానే అన్ని క్లీయర్ చేసి సినిమా డిసెంబర్ 5నే రిలీజ్ చేసి ఉంటే… ఏ చిన్న నెగిటివ్ డిస్కషన్ కూడా ఉండేది కాదు. సినిమా ఇంకా మరో లెవెల్‌లో దుమ్ము రేపేది. అఖండ 2కి ఇప్పుడున్న చిన్న నెగిటివ్ కూడా పూర్తిగా మాయమైపోయేది.” అని వారు బాధపడుతున్నారు. అయినా… చివరికి సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాక వచ్చిన హిట్ టాక్, ప్రేక్షకుల స్పందన, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ — ఇవన్నీ చూసి ఇప్పుడు నందమూరి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: