కానీ ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ పాత్ర మొదట ఆది పినిశెట్టి కోసం కాదట.ఇండస్ట్రీలో వినిపిస్తున్న బలమైన టాక్ ప్రకారం ఈ రోల్‌ను బోయపాటి శ్రీను ముందుగా రవితేజ కోసం డిజైన్ చేశారట. స్క్రిప్ట్ విని రవితేజనే మొదటి ఎంపికగా ఫిక్స్ కూడా చేశారట. కానీ రవితేజ ఈ రకమైన వైలెంట్, గ్రే షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించడానికి ఆసక్తి చూపలేదట. తన ఇమేజికి సరిపోదని భావించి, నేరుగా “చేయను” అని చెప్పేశాడని చెప్పుకుంటున్నారు. దాంతో ఈ పాత్ర కొంతకాలం నిర్మాతల చేతిలోనే నిలిచిపోయింది.తరువాత మరికొంతమంది స్టార్ హీరోల పేర్లు కూడా చర్చలోకి వచ్చాయని, కానీ వివిధ కారణాల వల్ల ఫైనల్‌గా ఒప్పుకోలేదని టాలీవుడ్ సర్కిల్‌లో కథనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. చివరికి బోయపాటి ఆ పాత్రను ఆది పినిశెట్టికి నేరుగా నేరేట్ చేయగానే అతను ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా “ఎస్” చెప్పేశాడట. ఎందుకంటే ఇలాంటి తీవ్రమైన, మానసికంగా కంప్లెక్స్ ఉన్న పాత్రలు తరచూ రాకపోవడం… అలాగే తన కెరీర్‌లో కొత్త పంథాలోకి తీసుకెళ్తుందని ఆది గ్రహించాడట.
మరి నిర్ణయం ఎంత కరెక్ట్ అనేది ఇప్పుడు థియేటర్లలో చూస్తే తెలుస్తోంది. ఈ పాత్రను రవితేజ లేదా మరెవరైనా చేసినా ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చేదేమో తెలియదు కానీ ఆది పినిశెట్టి మాత్రం ఈ రోల్‌తో తన కెరీర్‌లో కొత్త డోర్ ఓపెన్ చేసుకున్నాడు అనే మాట మాత్రం నిజం. ప్రేక్షకులు కూడా “ఇది ఆది పినిశెట్టి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్” అని చెప్పుకుంటున్నారు. బాలయ్య స్క్రీన్‌పై అగ్నిలా దహించిపోతుంటే, ఆది పినిశెట్టి తన ప్రత్యేకమైన స్టైల్‌తో విలన్‌గా మరింత తుఫానులా దూసుకొచ్చి ప్రేక్షకులను షాక్‌లోకి నెట్టేశాడు. ఇక సోషల్ మీడియాలో అయితే ఒక్క మాటే “ఈ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోలకు ఇదంతా నిజంగా బ్యాడ్ లక్!”
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి