సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా చాలామంది హీరోయిన్‌లు తమ పాత్రల కంటే గ్లామర్, ఫేమ్, రీచ్ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఏ సినిమా చేస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది, ఏ హీరో పక్కన నటిస్తే మన పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది, ఏ ప్రాజెక్ట్ మన కెరీర్‌ను హైప్ చేస్తుంది—ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ, అవకాశాలు వచ్చినప్పుడల్లా వెంటనే అంగీకరించే పరిస్థితులు కూడా చాలాసార్లు కనిపిస్తాయి. అయితే ఈ లెక్కల్లో పడకుండా, తమకంటూ ఒక ప్రామాణికతను, ఒక నిర్ణయాన్ని, ఒక విలువను కట్టిపడేసుకున్న ఇద్దరు హీరోయిన్‌లు మాత్రం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు వస్తున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు—నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరియు మహానటి కీర్తి సురేష్.ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచే రష్మిక ఎంత వేగంగా ఎదుగుతోందో అందరికీ తెలిసిందే. వరుసగా పాన్  ఇండియా సినిమాలు, పెద్ద బ్యానర్ల ప్రాజెక్టులు, స్టార్ హీరోలతో బ్యాక్-టూ-బ్యాక్ ఆఫర్లు—ఇవన్నీ ఆమె క్రేజ్‌కి నిదర్శనం. అదే సమయంలో కీర్తి సురేష్ కూడా తన కెరీర్‌లో ఎప్పుడూ నటనను ప్రధానంగా పెట్టుకొని ముందుకు సాగింది. ‘మహానటి’ తర్వాత ఆమె రేంజ్ పూర్తిగా మరో లెవెల్‌కు చేరింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోను ఆమె పాత్రల ఎంపికలో ఉన్న మెచ్యూరిటీ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.


వీరిద్దరి మధ్య చాలా విషయాలు వేరు అయినా… ఒక విషయంలో మాత్రం ఈ ఇద్దరూ సేమ్ టు సేమ్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు గట్టిగా చెప్పుకుంటున్నారు.అదే విషయం—ఇండస్ట్రీలో ఎన్నో ఆఫర్లు వచ్చినా… రష్మిక, కీర్తి సురేష్ ఇద్దరూ ఇప్పటివరకు ఒకటీ ఐటమ్ సాంగ్ చేయలేదు.కీర్తి సురేష్‌కి ఇండస్ట్రీలో అనుభవం చాలా ఎక్కువ. ఆమె కెరీర్‌లో ఎన్నో టైమ్‌లలో ఐటమ్ సాంగ్ ఆఫర్లు వచ్చాయి. కానీ ఎప్పుడూ ఒకే మాట— “నేను నా ఇమేజ్‌ను తగ్గించే, నా విలువలకు విరుద్ధంగా ఉండే పాత్రలు చేయను.”అదే విధంగా రష్మిక కూడా ఇప్పటివరకు ఒక్క ఐటమ్ సాంగ్ కూడా చేయలేదు. ఎన్నో టాప్ బ్యానర్స్, భారీ రెమ్యూనరేషన్‌తో కూడిన ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె కూడా తన నిర్ణయంలో ఎప్పుడు రాజీ పడలేదు. తన కెరీర్‌లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయంలో ఇద్దరికీ స్పష్టమైన రూల్స్ ఉన్నాయి.



ఇంకా ప్రత్యేకం ఏంటంటే—ఇలాంటి రూల్స్ చెప్పిన కొన్ని హీరోయిన్‌లు తర్వాత పరిస్థితుల వల్ల ఐటమ్ సాంగ్స్ చేసి తమ నిర్ణయాలను మార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ రష్మిక, కీర్తి సురేష్ మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ తమ మాటకు కట్టుబడి నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా ఐటమ్ నంబర్స్ చేసే అవకాశమే లేదని అనిపిస్తోంది.ఇదే కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్లిద్దరి మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. “అందం ఉన్నా… అవకాశాలు ఉన్నా… తమ విలువల ముందు రాజీ పడకుండా నిర్ణయాన్ని నిలబెట్టుకోవడం అసలు చిన్న విషయం కాదు” అంటున్నారు నెటిజన్లు. రష్మిక—కీర్తి ఇద్దరూ నటనలో సత్తా చాటుతూ, కెరీర్‌ను ఎంతో ప్రేమతో, గౌరవంతో ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయం ఈ నిర్ణయంతో మరొక్కసారి రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: