సోషల్ మీడియాలో ఇప్పుడు కృత్తి శెట్టి - త్రివిక్రమ్ సినిమాను రిజెక్ట్ చేసిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోయిన్‌గా నటించడానికి ఆఫర్ వచ్చినప్పటికీ, ఆమె ఆ సినిమాను తాను రద్దు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ప్రత్యేకంగా "గుంటూరు కారం" సినిమాలో చోటు చేసుకుందట. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా, మరియు మీనాక్షి చౌదరి మరో కీలక హీరోయిన్గా నటించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధారణం కంటే కొంచెం యావరేజ్ స్థాయి మాత్రమే సాధించింది. నిజానికి ఈ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్రకు ముందుగా ఇతర హీరోయిన్లను చాలా మందే అనుకున్నారట.వాళ్లల్లో మొదటగా, ఈ పాత్ర కోసం కృతి శెట్టిని ఆలోచించారట. అయితే ఆమె కధ విని ఆఫర్ రిజెక్ట్ చేయడంతో ..తర్వాత ఆ ప్లాన్‌ను రద్దు చేసి మీనాక్షి చౌదరి తీసుకున్నారట.
సినిమా రిలీజ్ అయిన తర్వాత, అభిమానులు ఈ సినిమా గురించి వినిపించిన టాక్ చూసి కృతి శెట్టి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అప్పటి మీమ్‌స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది ప్రేక్షకులు, ఈ సినిమా దొబ్బేసింది. రిజెక్ట్ చేసి మంచి పని చేశావ్ కృతి అని పొగిడేశారు. మొత్తంగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చాలా విజయవంతంగా ఉంటాయి, కానీ కృత్తి శెట్టి కొన్ని సందర్భాల్లో, ఏకకాలంలో వచ్చిన ఆఫర్స్‌ను రిజెక్ట్ చేయడం, సోషల్ మీడియాలో చర్చకు సంబంధించిన ప్రధాన కారణంగా మారింది. ఒక విధంగా రిజెక్ట్ చేసి మంచి పనే చేసింది అంటున్నారు ఫ్యాన్స్..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి