తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఫ్యాక్షన్, లవ్ స్టోరీలు, కామెడీ ఎంటర్‌టైనర్లకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మన స్టార్ హీరోలు సిటీలను, విదేశీ లొకేషన్లను వదిలేసి, దట్టమైన అడవుల బాట పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాలంటే, పచ్చని అడవి బ్యాక్‌డ్రాప్ ఉండాల్సిందేనని మేకర్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న క్రేజీ ప్రాజెక్టులన్నీ ఈ కొత్త సెంటిమెంట్‌ను స్పష్టం చేస్తున్నాయి.


SSMB29తో మొదలైన 'అడ్వెంచర్' ఫీవర్!
ఈ కొత్త ట్రెండ్‌కు ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' (SSMB29) సినిమానే అని చెప్పొచ్చు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమౌళి లాంటి విజన్ ఉన్న దర్శకుడు అడవి నేపథ్యాన్ని ఎంచుకున్నారంటే, అందులో విజయం తాలూకు సీక్రెట్ ఏదో ఉందని మిగతా మేకర్స్ గ్రహించారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి అరణ్యం వైపే మళ్లింది.



సక్సెస్ ఫార్ములాగా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్!
నిజానికి, ఈ 'అడవి సెంటిమెంట్' ఇప్పుడు పుట్టింది కాదు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్ము దులిపిన చిత్రాలన్నీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చినవే. పుష్ప: ఎర్రచందనం అడవుల్లో సాగిన ఈ కథ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. RRR: కొమురం భీమ్ ఎపిసోడ్స్‌లో అడవి నేపథ్యం కీలకం. కాంతార: కన్నడ సెన్సేషన్ 'కాంతార' కూడా అడవి, పల్లె నేపథ్యంతో సంచలనం సృష్టించింది. ఈ నేచురల్ లొకేషన్స్, రా అండ్ రస్టిక్ ఫీల్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చడంతో, ఇప్పుడు ఇది టాలీవుడ్‌లో ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది.



యువ హీరోల నుంచి స్టార్ల వరకు.. అడవి తల్లి ఒడిలోనే!
సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ ఇప్పుడు యంగ్ హీరోలు కూడా క్యూ కట్టారు. నాగ చైతన్య నటిస్తున్న 'వృషకర్మ' ఒక మిస్టికల్ థ్రిల్లర్. ఇది గుహలు, దట్టమైన అడవుల చుట్టూ తిరుగుతుందట. అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ చేస్తున్న 'సంబరాల ఏటిగట్టు' సినిమాలో కూడా అడవి నేపథ్యం కీలకం కానుందని టాక్.



యంగ్ టైగర్ ఎన్టీఆర్ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే సినిమాలో కీలక సన్నివేశాలు కర్ణాటక అడవుల్లో ప్లాన్ చేస్తున్నారట. ఇక శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండబోతోందని సమాచారం. ఇలా స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు, టాలీవుడ్‌లోని వారంతా అడవి తల్లి ఒడిలోనే తమ తదుపరి బ్లాక్ బస్టర్ హిట్ కోసం అన్వేషిస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: