సినిమా రంగం అంటే కేవలం గ్లామర్, యాక్షన్, కోట్లు సంపాదించడమే కాదు. కొందరు సెలబ్రిటీలు తమ జీవిత చివరి క్షణాలలో చూపించిన దాన గుణం వారిని నిజమైన లెజెండరీ మాస్ హీరోలుగా నిలబెట్టింది. సినిమాల ద్వారా, వ్యాపారాల ద్వారా సంపాదించిన వందల కోట్ల రూపాయల ఆస్తులను తమ కుటుంబ సభ్యులకు కాకుండా, పేదలకు, అనాథలకు, దేవాలయాలకు విరాళంగా ఇచ్చి 'గొప్ప మనసు'ను చాటుకున్నారు.

1. శ్రీ విద్య: అనాథల కోసం వందల కోట్లు!
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అందాల కథానాయికగా ఒక వెలుగు వెలిగిన శ్రీ విద్య దాన గుణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 14 ఏళ్ల వయసులోనే ఆర్థిక సమస్యలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, రజనీకాంత్, కమల్‌హాసన్‌లతో కలిసి ఎన్నో సినిమాలు చేశారు.

కానీ, వ్యక్తిగత జీవితంలో ఆమెకు విషాదం ఎదురైంది. 2003లో క్యాన్సర్ ఉన్నట్లు తెలియడంతో, తన మరణానంతరం తన ఆస్తులు ఏవీ భర్తకు చెందకుండా, వాటిని అనాథ పిల్లలకు దానం చేసింది. ఒక ఫౌండేషన్ ద్వారా ఇతర సెలబ్రిటీల సహాయంతో ఇంకొంత డబ్బును సేకరించి, ఆ మొత్తాన్ని కూడా అనాథల కోసమే వినియోగించింది. శ్రీవిద్య చూపించిన ఈ మానవత్వం చిరస్మరణీయం.

2. నటి అర్చన: టీటీడీకి భారీ విరాళం!
ఇకపోతే, 'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరోకి నానమ్మ పాత్రలో కనిపించిన ప్రముఖ నటి అర్చన, తన ఆస్తి మొత్తాన్ని దానం చేయకపోయినా... ఒక విలువైన ఆస్తిని దానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అర్చన... తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సుమారుగా రూ.100 కోట్ల విలువైన ఆస్తులను దానంగా రాసిచ్చింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

3. ఎం. ప్రభాకర్ రెడ్డి: చిత్రపురి కాలనీకి మూలకర్త!
దివంగత నటుడు, వైద్యుడు ఎం. ప్రభాకర్ రెడ్డి దానం చేసిన ఆస్తి విలువ ఇప్పుడు వందల కోట్లలో ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా అగ్ర హీరోల సినిమాలలో విలన్‌గా నటించిన ఆయన... సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు మారినప్పుడు, పేద సినీ కళాకారుల కోసం ఆ కాలంలోనే పది ఎకరాల పొలాన్ని దానంగా ఇచ్చేశారు. ఆయన దానం చేసిన భూమిలోనే నేడు మనం చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ ఉంది. హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న ఈ భూమి విలువ ఇప్పుడు వందల కోట్లు చేస్తూ, పేద కళాకారులకు ఆశ్రయం ఇస్తోంది.

వీరితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా పేదలకు ఉచితంగా ఆస్తులను దానం చేసి, తమ గొప్ప మనసును చాటుకున్నారు. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ వీరు రియల్ హీరోలు అని నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: