దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు వినిపించగానే సినిమా లవర్స్‌లో ఆటోమేటిక్‌గా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా ఓ విజువల్ వండర్‌గా, సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది.ఈ చిత్రం కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం షాక్ ఇచ్చే స్థాయిలో ఉండబోతుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ టెక్నీషియన్లు, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను రాజమౌళి తన కెరీర్‌లోనే మరో మైలురాయిగా మలచాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట.ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారనే అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపించినా, ప్రస్తుతం మాత్రం ఓ పేరు సినీ వర్గాల్లో గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఆ పేరు మరెవరో కాదు… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!


‘పుష్ప: ది రైజ్’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్, ‘పుష్ప-2: ది రూల్’తో ఆ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. నార్త్ ఇండియాలో కూడా బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఆఆ22క్షా6లో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.



అయితే, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండబోతోందనే ప్రచారం ఇప్పుడు ఫ్యాన్స్‌కు మెంటల్ ఎక్కించే స్థాయిలో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రాజమౌళి ప్లానింగ్ మొదలుపెట్టారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.ఈ వార్తను మరింత ఆసక్తికరంగా మార్చేది ఇంకో అంశం. రాజమౌళి సినిమాల వెనుక కీలక పాత్ర పోషించే ఆయన తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కథ పూర్తిగా ట్రైబల్ బ్యాక్‌డ్రాప్‌లో, అడవులు, గిరిజన జీవన శైలి, వారి పోరాటం నేపథ్యంలో సాగనుందనే టాక్ జోరుగా నడుస్తోంది.



ఇలాంటి కథకు అల్లు అర్జున్ ఎనర్జీ, స్టైల్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కలిస్తే… స్క్రీన్‌పై అగ్ని రాజుకుంటుందని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. రాజమౌళి మార్క్ ఎమోషన్, యాక్షన్, గ్రాండ్ విజువల్స్ తో ఈ కాంబో నిజమైతే థియేటర్లు తగలబడిపోవడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి ప్రచార వార్తలే. అల్లు అర్జున్రాజమౌళి కాంబో నిజంగానే ఫిక్స్ అయిందా? విజయేంద్ర ప్రసాద్ ట్రైబల్ కథను వాస్తవంగా రెడీ చేస్తున్నారా? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఇంకా కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.కానీ ఒక విషయం మాత్రం స్పష్టం…ఈ కాంబో నిజమైతే, అది భారతీయ సినిమా చరిత్రలోనే ఓ సెన్సేషన్‌గా నిలవడం ఖాయం. అప్పటివరకు ఈ న్యూస్‌తోనే ఫ్యాన్స్‌కు మెంటల్ ఎక్కడం గ్యారంటీ!

మరింత సమాచారం తెలుసుకోండి: