ఐకాన్ స్టార్ అనగానే అందరికి అల్లు అర్జున్ నే గుర్తు వస్తాడు. బన్నీ హీరోగా, ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌ను అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ మొదటినుంచి చెబుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో మరియు సినిమా వర్గాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.


మరీ ముఖ్యంగా దర్శకుడు అట్లీ  ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడని, ఒక భాగం వచ్చే ఏడాది విడుదల కాగా, రెండో భాగాన్ని 2027లో రిలీజ్ చేయనున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలు అల్లు అర్జున్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. స్టార్ హీరో సినిమా రెండు భాగాలు అంటే ఖచ్చితంగా ఆ హైప్ ఉంటుంది. అయితే ఈ రూమర్స్‌పై తాజాగా స్పష్టత వచ్చిందని సినీ వర్గాల్లో ఓ న్యూస్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి సీక్వెల్స్ లేదా పార్ట్-1, పార్ట్-2 లాంటి ప్లానింగ్ లేకుండా కేవలం ఒక్క సినిమా గానే విడుదల కానుంది.

 

అంటే రెండు భాగాలుగా సినిమా ఉంటుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఈ సినిమాను ఒకే భాగంగా, సంపూర్ణ కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. తొలిసారి అల్లు అర్జున్ సరసన దీపికా నటిస్తుండటంతో ఈ జోడీపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌కు ఏమాత్రం వెనుకాడకుండా, టెక్నికల్‌గా కూడా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.



మొత్తంగా చూస్తే, అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఒకే భాగంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, రెండు భాగాలుగా వస్తుందన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టమవుతోంది. అధికారికంగా మరిన్ని వివరాలు వెలువడితే, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: