మహేష్ బాబు పరిస్థితి మాత్రం పూర్తిగా వేరే. ఆయన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యారు. ఆ సినిమాకు సంబంధించిన లుక్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసమే ఆయన ఈ ఏడాది మొత్తాన్ని ఖర్చు చేశారు. అందుకే ఈ ఏడాది ఆయన నుంచి సినిమా రాకపోయినా అభిమానులకు పూర్తి క్లారిటీ ఉంది.కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు మాత్రం డార్లింగ్ ప్రభాస్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ ఏడాది ప్రభాస్ ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినా సరే, 365 రోజులు ఆయన పేరు మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక కారణంతో ట్రెండ్ అవుతూనే వచ్చింది.
ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, పూజా కార్యక్రమాలు, ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్లు ఈ ఏడాది మొత్తం సోషల్ మీడియాలో హంగామా క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అభిమానులు బెస్ట్‌గా చెప్పుకునేది ‘రాజా సాబ్’ మూవీ అప్డేట్స్, అలాగే ‘స్పిరిట్’ సినిమా సంబంధిత వార్తలు. వీటి కారణంగా ఏడాది మొత్తం ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా, ఒక్క సినిమాలో కూడా నటించకుండా… ఏడాది పొడవునా తన పేరుతో సోషల్ మీడియాను ట్రెండ్ చేయించిన ఏకైక హీరో ప్రభాస్ అంటూ అభిమానులు గర్వంగా ప్రకటిస్తున్నారు. ఇది నిజంగా ఒక స్పెషల్ రికార్డ్ అనే చెప్పాలి. కన్నప్ప సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరిసిన అది ఆయన హీరో గా పరిగణించలేము. గెస్ట్ రోల్ అంతే.
2025లో ప్రభాస్ నుంచి సినిమా రాకపోయినా, ఈ సంవత్సరం మాత్రం ఆయనకు మరిచిపోలేని ఏడాదిగానే నిలిచిపోతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అలాగే ‘రాజా సాబ్’ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ సినిమాలతో థియేటర్లు రచ్చ రచ్చగా మారతాయని, మొత్తం ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాడని అభిమానులు గట్టి నమ్మకంతో చెబుతున్నారు. సినిమాలు లేకపోయినా ట్రెండ్స్‌తో రాజ్యమేలిన హీరోగా 2025లో ప్రభాస్ తనదైన ముద్ర వేసుకున్నాడు అనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి