ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పూర్తి స్థాయి మాస్, ఇంటెన్స్, పవర్‌ఫుల్ అవతారం ను ‘ఓజీ’ ద్వారా సుజిత్ తెరపై ఆవిష్కరించాడు. అభిమానుల ఆకలిని తీరుస్తూ, వారి ఊహలకు మించి పవన్‌ను ప్రెజెంట్ చేసిన విధానం సినిమా విడుదలైన ప్రతిచోటా సంచలనం సృష్టించింది. థియేటర్లలో అభిమానుల హంగామా, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అన్నీ ‘ఓజీ’ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో స్పష్టంగా చూపించాయి.
సినిమా విడుదల తర్వాత క్రిటిక్స్ నుంచి ప్రేక్షకుల వరకు అందరి నుంచి పాజిటివ్ టాక్ రావడం, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం ‘ఓజీ’ని ఈ ఏడాది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ లో ఒకటిగా నిలబెట్టాయి. ముఖ్యంగా సుజిత్ దర్శకత్వం మీద వచ్చిన ప్రశంసలు ఆయన కెరీర్‌లోనే ఒక టర్నింగ్ పాయింట్‌గా మారాయి.
‘ఓజీ’తో సుజిత్ కేవలం ఒక హిట్ డైరెక్టర్‌గా మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌ను పూర్తిస్థాయిలో హ్యాండిల్ చేయగల దర్శకుడిగా తన సత్తా చాటాడు. సినిమా పట్ల ఆయన చూపించిన డెడికేషన్, ప్రతి సీన్‌లో కనిపించే డీటైలింగ్, కథకు ఇచ్చిన బలమైన ట్రీట్‌మెంట్— సుజిత్ సినిమాలను కేవలం తీయడు, జీవిస్తాడు.
అందుకే 2025లో ‘ఓజీ’ ఒక సినిమా మాత్రమే కాదు…
*సుజిత్ కెరీర్‌లో ఒక మైలురాయి
*పవన్ అభిమానులకు ఒక ఫెస్టివల్
*తెలుగు సినీ చరిత్రలో ఒక నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ మూమెంట్
ఇక నుంచి సుజిత్ పేరు వినిపిస్తే, అభిమానుల అంచనాలు వేరే లెవల్‌లో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఓజీ’తో ఆయన తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు… టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో శాశ్వతంగా చోటు సంపాదించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి