పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్' (The raja Saab) చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ రిద్ధి కుమార్ , తాజాగా ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఆమెకు ఇచ్చిన ఒక 'స్పెషల్ గిఫ్ట్' గురించి రిద్ధి వెల్లడించిన విషయాలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి.


'ది రాజా సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రిద్ధి కుమార్ ధరించిన తెల్లటి చీర (White Saree) వెనుక ఒక అందమైన కథ ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ప్రభాస్ గొప్ప మనసు గురించి విన్న రిద్ధి, ఆయనకు 'కర్ణుడి' తత్వం ఉన్న 'మృత్యుంజయ్' అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారట. దానికి ప్రతిగా ప్రభాస్ ఆమెకు ఈ చీరను దీపావళి కానుకగా గిఫ్ట్ ఇచ్చారు. ఆ చీరను ప్రభాస్ తనకు మూడేళ్ల క్రితమే (రాధే శ్యామ్ సమయంలో) ఇచ్చారని, దానిని ఎంతో భద్రంగా దాచుకుని, ఆయనతో కలిసి నటించిన ఈ సినిమా వేడుకలోనే కట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె భావోద్వేగంగా తెలిపారు.ఈ ఈవెంట్‌లో రిద్ధి ప్రభాస్‌ను 'సార్' అని కాకుండా నేరుగా "ప్రభాస్" అని పేరుతో పిలవడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే ఆమె అలా పిలిచి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.



తొలుత ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలియగానే రిద్ధి నమ్మలేకపోయారట.నిర్మాత ఎస్‌కేఎన్ నుండి ఫోన్ వచ్చినప్పుడు, ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా అవకాశం అంటే ఎవరో తనతో 'ప్రాంక్' చేస్తున్నారని భావించినట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రభాస్ సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారని, ఆయన కామెడీ టైమింగ్‌ను దగ్గర నుండి చూడటం ఒక అద్భుతమైన అనుభూతి అని రిద్ధి పేర్కొన్నారు.ప్రభాస్ తన తోటి నటీనటులకు భోజనం పెట్టడమే కాకుండా, ఇలాంటి విలువైన బహుమతులు కూడా ఇస్తారని రిద్ధి మాటల ద్వారా మరోసారి స్పష్టమైంది. ఆమె వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: