కిరాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ మొదలు పెట్టినప్పటి నుంచి అక్కడి నుంచే చేపలు తెప్పిస్తానని, అక్కడినుంచి మసాలా దినుసులతో పాటు వర్కర్స్ కూడా నెల్లూరు నుంచే వస్తారని తెలిపారు. చాలామంది తమ కర్రీని టేస్ట్ చేయడానికి క్యూ కట్టేవారు.. కానీ రాను రాను కర్రీ అంత టేస్ట్ గా లేదని రేటు ఎక్కువగా ఉందని చాలామంది కామెంట్స్ చేసిన వాటిని అసలు పట్టించుకోలేదు. కిరాక్ ఆర్పి మాత్రం వరుసగా పలు రకాల బ్రాంచ్లను ఓపెన్ చేసిన కిరాక్ ఆర్పి, డబ్బులు తీసుకొని ఇతర ప్రాంతాలలో కూడా ఫ్రాంచైజీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.
కానీ సడన్గా ఈ బిజినెస్ క్లోజ్ చేసి రాజకీయాలలో బిజీగా మారారు. టిడిపి తరఫున ప్రచారం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కిరాక్ ఆర్పి. అయితే ఈ బిజినెస్ మూసివేయడంపై మాట్లాడుతూ.. తన లైఫ్ లో బిజినెస్ అనేది ఒక భాగమని ,పొలిటికల్ కూడా తన జీవితంలో ఒక భాగమే అని తెలిపారు. రాజకీయాలలో బిజీ అవడం వల్లే తాను ఈ చేపల పులుసు బిజినెస్ నుంచి విరమించుకున్నానని ఇక తన రాజకీయ భవిష్యత్తు పైన క్లారిటీ ఇస్తూ.. టిడిపి నుంచి తనకు ఏదైనా పదవి ఇస్తే స్వీకరించడానికి తాను సిద్ధంగానే ఉన్నాను. తనకు ఎలాంటి పదవి ఇచ్చినా నిజాయితీగా పనిచేస్తానని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి