తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన తాజాగా అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నుండి ఇప్పటికే మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ , జాతి రత్నాలు , మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు మంచి విజయాలను సాధించి ఉండడం , అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ మూవీ కి మంచి ప్రీ బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా జాగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను క్లియర్గా తెలుసుకుందాం. ఈ సినిమాకు నైజాం ఏరియాలో 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఆంధ్ర లో 9.5 కోట్లు , సీడెడ్ లో 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 19.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.5 కోట్లు , ఓవర్సీస్ లో 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 29 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతుంది. ఈ సినిమా 29 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే హిట్టు స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: