అదే మార్గాన్ని ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా ఫాలో అవుతోందని అభిమానులు చెబుతున్నారు. ఆమె కూడా ఎలాంటి రూల్స్ అయినా సరే, తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఒప్పుకోవడం లేదట. కేవలం హీరోయిన్‌గా కనిపించడమే కాదు, కథలో తన పాత్రకు బలం ఉండాలని, నటనకు స్కోప్ ఉండాలని ఆమె కచ్చితంగా చూస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇప్పటికే రుక్మిణి వసంత్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సమయంలోనే కొందరు అభిమానులు “నేషనల్ క్రష్ రష్మిక మందన తర్వాత ఆ స్థానం రుక్మిణి వసంత్‌దే” అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, “రుక్మిణికి కూడా నేషనల్ క్రష్ ట్యాగ్ ఇవ్వాలి” అంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు.
అయితే రుక్మిణి వసంత్ మాత్రం ఈ ట్యాగ్స్, ట్రెండ్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా, “జనాలను ఎంటర్టైన్ చేయడమే నా లక్ష్యం” అని చెప్పుకుంటూ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇది కూడా సమంత స్టైల్‌ను గుర్తు చేస్తోంది. సమంత కూడా తన కెరీర్‌లో ఎప్పుడూ నెగిటివ్ టాక్స్‌ను పెద్దగా పట్టించుకోకుండా, తన పనిపై మాత్రమే ఫోకస్ పెట్టేది.కేవలం ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్ విషయంలో కూడా రుక్మిణి వసంత్ .. సమంతను ఫాలో అవుతోందని అభిమానులు చెబుతున్నారు. సమంత తన సంపాదనను వృథా చేయకుండా, తెలివిగా బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతుందని అందరికీ తెలిసిందే. ఆమె రియల్ ఎస్టేట్, ఫిట్‌నెస్, బ్రాండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టి, తన డబ్బును డబుల్ అయ్యేలా చేసుకుంటోంది. అదే తరహాలో రుక్మిణి వసంత్ కూడా ఇప్పుడు తన సంపాదనను ఫ్యూచర్ కోసం సేఫ్‌గా ప్లాన్ చేస్తోందట. ఆమె డబ్బును వృథాగా ఖర్చు చేయకుండా, బిజినెస్‌లలో పెట్టుబడి పెట్టడం, ఫిట్‌నెస్ సెంటర్ లేదా జిమ్ వంటి ప్రాజెక్ట్స్‌ను మెయింటైన్ చేయడం లాంటివి చేస్తున్నట్లు సమాచారం. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెపై మరింత గౌరవం పెంచుకుంటున్నారు.
“ఇంత చిన్న వయసులోనే ఇంత ముందుచూపుతో ప్లాన్ చేస్తోంది అంటే నిజంగా గ్రేట్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెరుగుతున్నాయి. చాలా మంది “రుక్మిణి వసంత్ అచ్చం సమంత లానే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోంది” అని ప్రశంసిస్తున్నారు. నటనతో పాటు బిజినెస్ మైండ్ కూడా ఉండటం వల్లే సమంత ఈ స్థాయికి చేరిందని, అదే మార్గాన్ని ఇప్పుడు రుక్మిణి కూడా అనుసరిస్తోందని అంటున్నారు. ఇలా నటిగా మాత్రమే కాకుండా, ఒక బిజినెస్ వుమన్‌గా కూడా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న రుక్మిణి వసంత్, భవిష్యత్తులో మరింత పెద్ద స్టార్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇండస్ట్రీలో ఈ తరహా ముందుచూపు ఉన్న హీరోయిన్లు అరుదు. అందుకే “మందు చూపు ఎక్కువే” అంటూ రుక్మిణి వసంత్‌ను ప్రశంసిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి