కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ 2026 ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ జంట హోటల్లో ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం అభిమానులను నమ్మేలా చేస్తోంది. గత కొంతకాలంగా ప్రవేట్ పార్టీలలో ఇద్దరూ కూడా క్లోజ్ గా కనిపిస్తూ ఉండడంతో ఇప్పుడు మరొకసారి ఫోటోలు బయటపడడంతో ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.


గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ను వివాహం చేసుకున్న ధనుష్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనంతరం కొన్నేళ్ల తర్వాత వారిద్దరు విడాకులు తీసుకోగా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ను పెళ్లి చేసుకోబోతూ ఉండడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత వారం రోజులుగా ఈ జంట గురించి ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరొక షాకింగ్ విషయం వైరల్ గా మారింది. అదేమిటంటే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అనే విషయం.


మృణాల్ ఠాకూర్ 1992 ఆగస్టు ఒకటిన జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 33 సంవత్సరాలు. ధనుష్ విషయానికి వస్తే.. 1983 జులై 28న జన్మించారు. అయితే ఇప్పుడు ధనుష్ ఏజ్ 42 సంవత్సరాలు. ఈ లెక్కను చూసుకుంటే సుమారుగా వీరిద్దరి మధ్య 9 నుంచి 10 సంవత్సరాల వరకు గ్యాప్ ఉండడం గమనార్హం. అయితే ఈ విషయం తెలిసిన పలువురు నెటిజెన్స్ మృణాల్ పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వివాహమై పిల్లలున్నవాడు తప్ప మరొకరు దొరకలేదా? అంటూ ఏకిపారేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మొత్తానికి ఈ జంట పైన వస్తున్న ఈ రూమర్స్ పైన అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని అభిమానులు సైతం కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: