తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోయిన్ రుక్మిణి వసంత్ బాగా సుపరిచితమే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ 2019లో బీర్బల్ అనే ఒక కన్నడ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది. 2023 లో వచ్చిన సప్త సాగరాలు దాటి అనే చిత్రంతో అటు తెలుగు, కన్నడలో భారీ గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత నిఖిల్ సరస అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.


రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 చిత్రంలో నటించగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఈమె నటనకు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. అలాగే ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం  డ్రాగన్ ప్రాజెక్టులో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షెడ్యూల్లో కూడా పాల్గొన్నట్లు వినిపిస్తోంది. ఇటువంటి సందర్భంలోనే తాజాగా రుక్మిణి వసంత్ ప్రేమలో పడిందనే విధంగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేయగా అవి వైరల్ గా మారింది. 2023లో స్వయంగా ఆ ఫోటోని రుక్మిణి వసంత్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలో ఉన్నది తన స్నేహితుడు సిద్ధాంత్ నాగ్. అయితే ఇతను కూడా నటుడుగానే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు. కానీ రుక్మిణి వసంత్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇద్దరు కూడా నటనలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్లోజ్ గా ఉండేవారని సమాచారం. అయితే ఇప్పుడు అప్పటి ఫోటోని స్క్రీన్ షాట్ తో  సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. మరి ఈ విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి రుక్మిణి వసంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: