ఈ నేపథ్యంలో బాలీవుడ్ మార్కెట్‌లో తెలుగు సినిమాలు ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్గా మారాయి. ప్రత్యేకించి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలపై హిందీ ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బన్నీ నటించిన ‘పుష్ప’ సిరీస్ ఇందుకు ఉత్తమ ఉదాహరణ. ముఖ్యంగా పుష్ప 2 హిందీలో సాధించిన వసూళ్లు బాలీవుడ్ హీరోల పేరుతో ఉన్న అనేక రికార్డులను తిరగరాసినట్లే కాకుండా, ఒక సౌత్ హీరోకి హిందీ బెల్ట్‌లో ఉన్న మార్కెట్‌ను పూర్తిగా రీడిఫైన్ చేశాయి.ఇదే కోవలో గతంలో బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, సాహో, సలార్, జై హనుమాన్ వంటి చిత్రాలు కూడా హిందీ మార్కెట్ నుంచి అద్భుతమైన ఓపెనింగ్స్‌తో పాటు భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ సినిమాలన్నీ అక్కడ విజయవంతం కావడానికి కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అవన్నీ స్ట్రెయిట్, ఒరిజినల్ కథలతో తెరకెక్కిన చిత్రాలే. రీమేక్‌లు కాకుండా, కొత్త కథలు, కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే వీటి బలంగా నిలిచింది.
అదే సమయంలో బాలీవుడ్ పరిస్థితిని పరిశీలిస్తే పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో సగానికి పైగా రీమేక్‌లు, సీక్వెల్స్, ప్రాంచైజీలు, బయోపిక్సే కావడం గమనార్హం. ఒకప్పుడు కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలీవుడ్, ఇప్పుడు పాత సినిమాలకు సీక్వెల్స్ తీస్తూ, రెండు దశాబ్దాల క్రితం వచ్చిన చిత్రాలను మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది. 20 ఏళ్ల నాటి కథలకు కూడా కొనసాగింపులు ఇస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారంటే, అక్కడ ఒరిజినాలిటీ కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.వాస్తవ కథలు, బయోపిక్స్‌పై అధికంగా ఆధారపడటం కూడా బాలీవుడ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక దశ వరకు బాగానే ఉన్నా, అదే ట్రెండ్‌ను పదే పదే అనుసరించడం వల్ల ప్రేక్షకుల్లో బోరు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే కొత్త కథలు, కొత్త ట్రీట్మెంట్‌తో వస్తున్న తెలుగు సినిమాలు అక్కడి ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మొత్తానికి, ఈ మారుతున్న పరిస్థితుల్లో తెలుగు సినిమా స్థాయి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి బాలీవుడ్ మార్కెట్‌లో వస్తున్న స్పందనే సరైన ఉదాహరణ. ఆ ప్రయాణంలో అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్లు తమ సినిమాలతో ట్రెండ్ సెట్ చేస్తూ, తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో మరింత బలంగా నిలబెడుతున్నారు. అందుకే ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్లు ఉన్నా, ఈ విషయంలో మాత్రం బన్నీ, మహేష్ మాత్రమే నిజంగా సో స్పెషల్ అని చెప్పాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి