దీనికి ప్రధాన కారణం.. ఇంకా సినిమా షూటింగ్ పూర్తిగా ముగియకపోవడమే. అలాగే, ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీ స్థాయిలో ఉండటంతో వాటికి కూడా ఎక్కువ సమయం అవసరం అవుతుందని తెలుస్తోంది. ఇదే బుచ్చి బబౌ చేసిన తప్పు అంటున్నారు అభిమనౌలు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కలర్ గ్రేడింగ్ వంటి అంశాలకు ఎక్కువ కేర్ తీసుకుంటుండటంతో త్వరపడి సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ లేరని సమాచారం. ఇదిలా ఉండగా, తెలంగాణలో టికెట్ రేట్ల అంశం కూడా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ప్రభావం చూపే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. పెద్ద హీరో సినిమా కావడంతో టికెట్ ధరలపై స్పష్టత లేకపోతే, రిలీజ్ ప్లానింగ్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట. అందుకే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని సినిమాను సరైన సమయానికి తీసుకురావాలని మేకర్స్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే, సినిమాను పర్ఫెక్ట్ ఫెస్టివల్ సీజన్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. సోషల్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం, ‘పెద్ది’ చిత్రాన్ని 2026 దసరా పండుగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వేసవి సీజన్‌లో విడుదల చేసే ఆలోచన ఉన్నప్పటికీ, దసరా టైమ్ అయితే సినిమాకు మరింత అనుకూలంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ అంటేనే కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా థియేటర్లకు భారీగా వస్తారు. అలాంటి సమయంలో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందన్నది మేకర్స్ అభిప్రాయంగా చెబుతున్నారు. అందుకే రిలీజ్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా, అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారట. అయితే, నిజంగా ‘పెద్ది’ సినిమా దసరా వరకు వాయిదా పడుతుందా? లేక ముందుగా ప్రకటించిన మార్చి 27 డేట్‌కే వస్తుందా? అనే విషయంపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానులు ఎదురుచూడక తప్పదు. ఏదేమైనా, రామ్ చరణ్ మాస్ అవతారంలో కనిపించనున్న ఈ చిత్రం మాత్రం విడుదలైనప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం సృష్టించనుందని అభిమానులు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి