రష్మిక మందన్నా.. ఎప్పుడైతే ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి హీరోయిన్ ని అందరూ ఓన్ చేసుకున్నారు. ఛలో మూవీ ఓ మోస్తారు హిట్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమా రష్మిక మందన్నా జీవితాన్ని మార్చేసింది.ఈ సినిమాతో రష్మిక కి వరుస హిట్స్ పడ్డాయి. ఒకటి రెండు సినిమాలు మధ్యలో ఫ్లాప్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ హీరోయిన్ కెరీర్ పై అస్సలు పడలేదు.అలా ఏడాదికి మూడు నాలుగు వేల కోట్ల సినిమాల్లో నటిస్తూ బ్లాక్బస్టర్ హిట్స్ అందుకుంటుంది.రీసెంట్ గా పుష్ప-2, అనిమల్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర,ఛావా వంటి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన కో-యాక్టర్ అయినటువంటి విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉందనే రూమర్ చాలా సంవత్సరాల నుండి వినిపిస్తుంది.

 వీరిద్దరూ కలిసి గీత గోవిందం సినిమా చేసే సమయంలోనే ప్రేమలో పడ్డారని, డియర్ కామ్రేడ్ సినిమాకి వీరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడి డేటింగ్ చేయడం స్టార్ట్ చేశారనే ప్రచారం జరిగింది.అయితే వీరిద్దరూ తరచూ డేట్ కి వెళ్లిన ఫొటోస్ వైరల్ గా మారడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుండి వీరి పెళ్లి డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే డిసెంబర్లో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇక రీసెంట్గా ఫిబ్రవరి 2న రష్మిక విజయ్ దేవరకొండపెళ్లి జరగబోతున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ అది నిజం కాలేదు. అయితే తాజాగా రష్మిక మందన్నా తన పెళ్లి డేట్ ని ఎయిర్పోర్ట్లో కన్ఫర్మ్ చేసింది. తాజాగా రష్మిక ఎయిర్పోర్ట్లో దిగి నడుచుకుంటూ వస్తున్న సమయంలో కొంత మంది రష్మీకకి హాయ్ చెప్పారు. 

అటుగా వస్తున్న ఓ వ్యక్తి రష్మిక పెట్టుకున్న మాస్క్ తీయమని చెప్పడంతో వెంటనే తీసేసింది.ఆ తర్వాత ఆ వ్యక్తి థాంక్స్ మ్యామ్ అని చెప్పడంతో పాటు కంగ్రాట్స్ చెప్పాడు. దానికి రష్మిక దేనికి రా అని అడిగితే వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 అంటూ ఆన్సర్ ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 26న రష్మిక విజయ్ దేవరకొండపెళ్లి జరగబోతుంది అనే ప్రచారం జరుగుతున్న వేళ ఎయిర్పోర్ట్లో ఆ వ్యక్తి చెప్పిన మాటలకి రష్మిక ఖండించకుండా క్యూట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది.అంటే ఫిబ్రవరి 26న రష్మిక విజయ్ దేవరకొండలు పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టే రష్మిక ఆ విషయాన్ని ఖండిచలేదు ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది అంటున్నారు నెటిజన్స్.మరి నిజంగానే ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరగబోతుందా.. అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: