మెగాస్టార్ చిరంజీవి గత కొద్ది రోజులుగా వివాదాల పాలవుతున్న సంగతి మనకు తెలిసిందే.గతంలో ఓ సినిమా ఈవెంట్లో నాకు మా ఇంట్లో ఉంటే ఉమెన్స్ హాస్టల్ లో ఉన్నట్లు ఉంటుందని, ఇంట్లో వాళ్ళందరూ అమ్మాయిలే, నాకు హాస్టల్ వార్డెన్ ఫీలింగ్ వస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఇంట్లో అందరికీ అమ్మాయిలే ఉన్నారు. చరణ్ కి అయినా ఒక కొడుకు పుడితే బాగుండు అంటూ మాట్లాడారు. దీంతో చాలా మంది నెటిజెన్లు మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.చిరంజీవికి ఆడవాళ్ళు అంటే అంత చులకనా.. అంత పెద్ద స్థాయిలో ఉండి ఆడ,మగ బేధం చూపించడం ఏంటి అంటూ మండిపడ్డారు.అయితే రీసెంట్గా చిరంజీవి అనుకున్నట్టే రామ్ చరణ్ కి కవల పిల్లలు పుట్టారు. అలా ఒక పాప బాబు పుట్టడంతో మెగా వారసుడు పుట్టాడు అని మెగా ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది.

అయితే ఈ నేపథ్యంలోనే గతంలో చిరంజీవి మాట్లాడిన మాటలు వైరల్ చేస్తూ చిరంజీవికి వారసుడి పిచ్చి ఉంది అని.. ఆడవాళ్లు అంటే చులకనా భావం అని, చిరంజీవికి మనవళ్ళు అంటేనే ఇష్టమని,ఇంట్లో ఉన్న ఆడవాళ్లను కూడా చులకనగా చూస్తారని విష ప్రచారం చేస్తున్నారు. అయితే చిరంజీవిపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై తాజాగా లావణ్య త్రిపాఠి కౌంటర్ ఇచ్చింది. లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది.. సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్వీట్లను సాధారణంగా అయితే నేను పట్టించుకోను. కానీ ఒక సంతోషకరమైన క్షణాన్ని విషపూరితంగా మార్చేస్తున్నారు. అందుకే ఈ విషయంపై స్పందిస్తున్నాను. చిరంజీవి గారు కుటుంబంలో ఉన్న వారిని ఎంత బాగా చూసుకుంటారో ఎంత చెప్పినా తక్కువే.. 

ఆయన కుటుంబానికి ఇచ్చే విలువ చాలామందికి సాధ్యం కాదు. ఆయన చేసే సహాయంలో కనీసం ఒక్క పర్సెంట్ కూడా సాయం చేయని వారు ఇలాంటి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్లు ఆయన వ్యక్తిత్వం పై దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. చిరంజీవి గారు తన ఇంట్లో ఉన్న మనవరాళ్లపై మహిళలపై ఎంతో గౌరవంతో, ప్రేమతో ఉంటారు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా ఇలా సోషల్ మీడియాలో తీర్పులు ఇవ్వడం తప్పు.అలాంటి వాళ్ళు ఇప్పటికైనా నోరు మూసుకుంటే మంచిది అంటూ మెగా కోడలు లావణ్య త్రిపాఠి చిరంజీవిపై విష ప్రచారం చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.లావణ్య త్రిపాఠి పెట్టిన పోస్ట్ కి చాలామంది మెగా ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: