పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, మరొకవైపు సినిమాలతో అభిమానులను అలరిస్తూ ఉన్నారు. గత ఏడాది ఓజి, హరిహర వీరమల్లు సినిమాలతో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టినట్లుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గతంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతోనే మళ్ళీ తిరిగి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.



అయితే పవన్ కళ్యాణ్ కి జోడిగా ఎవరిని హీరోయిన్గా తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజి  సినిమాలో హీరోయిన్గా  నటించిన ఇమాన్వి ని హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందనే విధంగా మేకర్స్ భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు సమూఖంగానే ఉన్నట్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్ ఇమాన్వి కి అటు సోషల్ మీడియాలో మంచి క్రేజీ ఉండడమే కాకుండా బెస్ట్ డాన్సర్ గా ,కొరియోగ్రాఫర్ గా కూడా పేరు సంపాదించింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో నటిస్తోంది కనుక ఒకవేళ ఇదే నిజమైతే ఫౌజీ సినిమా విడుదల కాకముందే ఇమాన్వి మరో స్టార్ హీరో తో జోడి కట్టే అవకాశం అందుకుంటుంది.


మరి ఈ విషయం పైన డైరెక్టర్ సురేందర్ రెడ్డి టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉన్నట్లు వినిపిస్తున్నాయి. టైటిల్ కూడా రెండు అక్షరాలు మాత్రమే ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు (ఓజి) ఇదే సెంటిమెంట్ ని ఉపయోగించి సక్సెస్ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఒకవేళ అన్ని అనుకూలిస్తే 2026 మార్చిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఏడాది చివరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేలా కూడా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: