టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు “వారణాసి” సినిమా పోస్టర్లలో ప్రత్యేకంగా “Filmed for IMAX screens” అని ఉండటం వల్ల ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది. అయితే తాజాగా జరిగిన ఒక హాలీవుడ్ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి దీనిపై స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కువ శాతం థియేటర్లు స్కోప్ ఫార్మాట్‌లోనే ఉంటాయని, ప్రేక్షకులు కూడా ఎక్కువగా అదే ఫార్మాట్‌లో సినిమాలు చూస్తారని చెప్పారు. ఐమ్యాక్స్ స్క్రీన్స్ ఉన్నప్పటికీ వాటి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సినిమా మొత్తం ఐమ్యాక్స్‌లో తీయాలా, లేక స్కోప్‌లో తీసి ఐమ్యాక్స్ వెర్షన్‌ను ప్రత్యేకంగా రూపొందించాలా అనే విషయంలో తమ టీమ్‌తో విస్తృతంగా చర్చించామని తెలిపారు.

చివరికి ఒక ప్రత్యేక విధానాన్ని ఎంచుకున్నామని ఆయన చెప్పారు. “వారణాసి” సినిమా ప్రధానంగా ‘1.90:1’ స్కోప్ ఫార్మాట్‌లో ఉంటుంది. అయితే ఐమ్యాక్స్ స్క్రీన్స్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ‘1.43:1’ నిజమైన ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ప్రదర్శించబడతాయి. ఏ సన్నివేశాన్ని ఏ ఫార్మాట్‌లో చూపించాలి అనేది ఇప్పటికీ ఒక సవాల్‌గా ఉంది అని రాజమౌళి వివరించారు. ఇంకా మాట్లాడుతూ, రెండు ఫార్మాట్ల షాట్లను కలిపేయాలని టెక్నికల్ టీమ్ సూచించినప్పటికీ, అలా చేస్తే సహజత్వం తగ్గిపోతుందని తాను భావించానని చెప్పారు. దానికి బదులుగా, ప్రేక్షకులకు నిజంగా ఐమ్యాక్స్ అనుభూతి కలిగేలా సినిమాను రూపొందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.

మన దేశంలో ఐమ్యాక్స్ స్క్రీన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ ఫార్మాట్ విస్తృతంగా అందుబాటులో ఉంది. సరైన సినిమా వస్తే, అక్కడి నుంచి వచ్చే కలెక్షన్లు నిజంగా ఊహాతీతంగా ఉండే అవకాశముంది.  మహేశ్  కెరియర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో కనిపించబోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: