హీరోయిన్ల విషయంలో కూడా అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోందని, అలాగే మరో కీలక పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్తలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో వార్త ఈ సినిమాపై మరింత చర్చకు దారితీసింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవి) ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అది చిన్న పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే సన్నివేశంలో ఆయన కనిపిస్తారని అంటున్నారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటించబోతున్నారని కొన్ని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఆర్జీవి పేరు వినగానే కాంట్రవర్సీలు, బోల్డ్ ఆలోచనలు, నిజాయితీగా మాట్లాడే స్వభావం గుర్తుకు వస్తాయి. అందుకే ఆయన “స్పిరిట్” సినిమాలో కనిపిస్తే అది సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయం ట్రెండ్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రభాస్-ఆర్జీవి కాంబినేషన్ స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుందో అనే చర్చలు కూడా మొదలయ్యాయి.
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఇంకా స్పష్టత లేదు. సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. ఇప్పటికైతే ఈ వార్తలు సినిమా ప్రమోషన్‌కు ముందే మంచి హైప్ తీసుకొచ్చాయని చెప్పాలి.“స్పిరిట్” సినిమా విడుదలయ్యే వరకు ఇలాంటి వార్తలు మరిన్ని వినిపించే అవకాశం ఉంది. ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాను ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం, ప్రభాస్ స్టార్‌డమ్, మరియు కథలో ఉండబోయే ఇంటెన్స్ ఎలిమెంట్స్ .. ఇవన్నీ కలిసొచ్చి ఈ సినిమాను భారీ స్థాయిలో నిలబెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి