ఏంటి ఇది నిజమేనా.. రష్మిక విజయ్ దేవరకొండలు ఆ చిన్న విషయానికి బయటపడి కోట్ల రూపాయల డీల్ ని వదులుకున్నారా.. ఇంతకీ విజయ్ రష్మిక చేసిన తప్పేంటి..ఎందుకు కోట్ల రూపాయల డీల్ ని వదులుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ రష్మిక పెళ్లి గురించి చాలా రోజుల నుండి వేల, లక్షల పోస్టులు, వార్తలు వైరల్ అవుతున్నాయి.ఎట్టకేలకు ఈ జంట ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది.అయితే ఇప్పటి వరకు ఈ వార్తని ఈ జంట ఖండించకపోవడంతో ఇది నిజమే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా సినీ వర్గాల్లో కూడా రష్మిక విజయ్పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరిగి రిసెప్షన్ హైదరాబాద్లో మార్చి 4న జరగబోతున్నట్టు మాట్లాడుకుంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకునే సమయంలో తమ పెళ్లి వేడుకను కొన్ని ఓటిటీ ప్లాట్ఫార్మ్స్ కి భారీ డీల్ కుదుర్చుకొని మరీ అమ్మేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు ఇలా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే విజయ్ రష్మిక పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలను కూడా స్ట్రీమింగ్ చేయడం కోసం ఓ ప్రముఖ ఓటీటి సంస్థ విజయ్ రష్మికల దగ్గరికి వచ్చి భారీ ఓటిటి డీల్ ని కూడా అడిగిందట. తమ పెళ్లి వీడియోల కోసం ఆ ఓటిటి సంస్థ భారీగా డబ్బులు చెల్లించడానికి ముందుకు వచ్చిందట. కానీ రష్మిక విజయ్ దేవరకొండలు మాత్రం తమ పెళ్లి వేడుకని ఓటీటికి అప్పగించడానికి ఒప్పుకోలేదట.ఇది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని, జీవితంలో ఎంతో స్పెషల్ అయినటువంటి పెళ్లి వేడుకని ఇలా డబ్బులకి అమ్ముకోమని చెప్పి పంపించేసినట్టు తెలుస్తోంది

.ఇలా పెళ్లి వేడుకని డబ్బులకు అమ్ముకోవడం ఇష్టం లేకే రష్మిక విజయ్ దేవరకొండలు కోట్ల రూపాయల డబ్బులని వదులుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే గతంలో నయనతార తన పెళ్లి వీడియోని నెట్ఫిక్స్ కి అమ్మి ఆ తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రష్మిక విజయ్ దేవరకొండలు తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలను ఎలాంటి ఓటీటిలకు కూడా అమ్మకుండా గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరి నిజంగానే రష్మిక విజయ్ లు ఓటిటి సంస్థ ఇచ్చిన ఆఫర్ ని వదులుకున్నారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: