జగపతిబాబు,సౌందర్య వీరి బాండింగ్ కి చాలామంది చాలా రకాల పేర్లు పెట్టారు. జగపతిబాబు సౌందర్య మాత్రం మేము మంచి ఫ్రెండ్స్ అంటుంటే చాలామంది సినీ వర్గాల వారు మాత్రం వీరి మధ్య ఫ్రెండ్షిప్ కి మించి ఏదో బంధం ఏర్పడింది అని అంటూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే సౌందర్య విమాన ప్రమాదంలో మరణించాక చాలామంది సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బాధపడ్డారు. కానీ సౌందర్య మరణించింది అనే మరణ వార్త వినగానే ఎక్కువ బాధపడింది మాత్రం వెంకటేష్ , జగపతిబాబు లాంటి హీరోలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంకటేష్, జగపతిబాబులు సౌందర్య తో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు.అలా వీరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఆ కారణంగానే వెంకటేష్, జగపతిబాబులు సౌందర్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. 

ముఖ్యంగా జగపతిబాబు సౌందర్య మరణ వార్త విని కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు సౌందర్య మరణం గురించి మాట్లాడుతూ.. సౌందర్య మరణం కంటే నన్ను ఆయన మరణమే ఎక్కువ కృంగదీసింది. ఆయన చావు వార్త వినగానే నేను సగం చచ్చిపోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు.మరి ఇంతకీ సౌందర్య చావు కంటే జగపతిబాబును మరింత కలిచి వేసిన ఆ మరణం ఎవరిది అనేది చూస్తే సౌందర్య అన్నయ్య అమర్ ది .. సౌందర్య అన్నయ్య అమర్ సౌందర్య కి సంబంధించిన అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునేవారు. అలా సౌందర్యతో ఏర్పడిన బంధం కారణంగా సౌందర్య అన్నయ్య అమర్ తో కూడా జగపతిబాబుకి మంచి బంధం ఏర్పడిందట. అయితే సౌందర్యకు మించి జగపతిబాబు అమర్ తో చాలా క్లోజ్ గా ఉండే వారట. అయితే విమాన ప్రమాదం జరిగిన సమయంలో జగపతిబాబుకి సౌందర్య చనిపోయింది అని ఫోన్ కాల్ వచ్చిందట.

ఆ సమయంలో బాధపడి అమర్ ఎలా ఉన్నాడు అని అడిగాడట. అంతేకాదు అమర్ బాగుంటే పర్వాలేదు. కానీ ఆయనకు ఏమైనా అయితే ఆ విషయం నాకు చెప్పద్దు అంటూ బాధతో ఫోన్ పెట్టేసాడట. కానీ ఆ విమాన ప్రమాదంలో సౌందర్య తో పాటు ఆమె అన్న అమర్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. అమర్ చనిపోయిన విషయాన్ని జగపతిబాబు జీర్ధించుకోలేకపోయారట.సౌందర్య చావు కంటే అమర్ చావు జగపతిబాబుని తీవ్రంగా బాధపెట్టిందట. ఈ విషయాన్ని రీసెంట్గా జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అంతేకాదు సౌందర్య అన్నయ్య అమర్ నా ప్రాణ స్నేహితుడని, ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయానని, ఆయన చావుతో నేను సగం చచ్చిపోయాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: