టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 'స్వయంభూ' (Swayambhu) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, నిఖిల్ కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతున్నారనే వార్త ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరోలు వెంకటేష్, రానా, నాగార్జున వంటి వారు ఓటీటీ బాట పట్టగా, ఇప్పుడు నిఖిల్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.నిఖిల్ ఒక క్రేజీ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది ఒక పక్కా థ్రిల్లర్ జోనర్ అని, నిఖిల్ మార్క్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.
నిఖిల్ ఎప్పుడూ రొటీన్ కథలకు నో చెబుతారు. అందుకే తన ఓటీటీ డెబ్యూ కోసం
 కూడా ఒక ప్రయోగాత్మకమైన, యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథను ఎంచుకున్నారట. ఈ సిరీస్ కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.


ప్రస్తుతం నిఖిల్ పూర్తి ఫోకస్ 'స్వయంభూ' సినిమాపైనే ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 13, 2026న విడుదల కావాల్సి ఉండగా, టీజర్ లోడ్ అయ్యాక ఏప్రిల్ 10, 2026కి షెడ్యూల్ చేశారు. ఈ చిత్రంలో నిఖిల్ ఒక పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో కనిపిస్తున్నారు.రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో నిఖిల్ స్వయంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.'ది ఇండియా హౌస్' (The india House) మరియు 'కార్తికేయ 3' వంటి భారీ చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ మధ్యలోనే తన ఓటీటీ ప్రాజెక్ట్‌ను కూడా నిఖిల్ ఫినిష్ చేయనున్నారట.



నిఖిల్ ఓటీటీలోకి రావడం పట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.మొబైల్ స్క్రీన్ల మీద కూడా నిఖిల్ మేజిక్ రిపీట్ అవుతుంది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లేదా నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్స్ ఈ సిరీస్‌ను నిర్మించే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.నిఖిల్ సిద్ధార్థ్ ఏది చేసినా అందులో ఒక కొత్తదనం ఉంటుంది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నారంటే, అది ఖచ్చితంగా ఒక సంచలనమే అవుతుంది. వెండితెరపై వారియర్‌గా మెరిసిపోతున్న నిఖిల్, డిజిటల్ స్క్రీన్‌పై ఎలాంటి 'విన్యాసాలు' చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: