ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మొదట ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించిన కానీ కొన్ని కారణాల చేత సినిమాని వాయిదా వేశారు. ఏప్రిల్ 30వ తేదీన పెద్ది సినిమాని విడుదల చేస్తామంటూ అనౌన్స్మెంట్ చేశారు. చరణ్ పుట్టినరోజునా వీడియో టీజర్ లో ఏప్రిల్ 30న విడుదల చేయబోతున్నట్టు చూపించారు. కానీ ఇప్పుడు పెద్ది సినిమా మరొకసారి వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన నిర్మాత ఎస్కేయన్ జూన్ 25న పెద్ది సినిమా థియేటర్లోకి రాబోతోందని తెలియజేశారు.
దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కి గురయ్యారు. సినిమా షూటింగ్ పెండింగ్ ఉండడంతో పాటుగా ఇటీవల రామ్ చరణ్ కంటికి కూడా గాయం కావడం చేత ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే ఐటెం సాంగ్ తో పాటుగా మరొక పాట షూటింగ్ పెండింగ్లో ఉన్నదని దీంతో పెద్ది సినిమా వాయిదా పడుతుందనే విధంగా వినిపిస్తున్నాయి. అఖిల్ లెనిన్ సినిమా జూన్ 26న రావాల్సి ఉండగా పెద్ది సినిమాతో మే ఒకటికి పోస్ట్ పోన్ చేసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే స్వయంభు సినిమా కూడా విడుదల అవ్వడానికి మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. వీటికి తోడు తరుణ్ భాస్కర్ నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. మరి పెద్ది సినిమా విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తారని చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి