రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబలి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తలతో పాటు, ఈ సినిమాలో వారు పోషిస్తున్న పాత్రలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘రణబలి’లో విజయ్ పోషిస్తున్న పాత్ర, అలాగే జయమ్మగా రష్మిక కనిపించబోతున్న తీరు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ గుర్రంపై దూసుకొస్తూ, పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతున్న సీన్ కనిపిస్తోంది. ఆయన చెప్పిన డైలాగ్‌లోని ఉత్సాహం, ఆగ్రహం, బాడీ లాంగ్వేజ్ కలిపి ఆ సన్నివేశానికి భారీ ఎలివేషన్ తీసుకొచ్చాయి. దీనిని ఇప్పుడు జనాలు హైలెట్ చేస్తున్నారు.  ‘రేయ్ ముండమోపినాకొడకా..ఏడున్నావ్ రా.. మీ ఇళ్లల్లోకి వచ్చిన.. రా  చంపుదువు కానీ’ అం టూ విజయ్ గుర్రం పై వస్తున్న వీడియో ఒకటి నెట్టిం ట వైరల్ అవుతుంది.

ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. “ఈసారి విజయ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు”, “డైలాగ్ డెలివరీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది”, “రణబలి బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, ఈ లీక్ వీడియోతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.  మొత్తానికి ఈసారి రణబలి తో విజయ్ ఖచ్చితంగా హిట్ కొట్టేస్తాదూ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. 




మరింత సమాచారం తెలుసుకోండి: