2014లో విడుదలైన "ప్రతినిధి" మరీ అంత పెద్ద హిట్ కాకున్నా ప్రేక్షకుల్ని అయితే ఆకట్టుకుంది. ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి ఓ సామాన్యుడు ఏం చేశాడు అనే నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా కమర్షియల్  హిట్ కొట్టి కాన్సెప్ట్ సినిమా పవర్ ను చూపించింది.సరిగ్గా పదేళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ గా రూపొందిన చిత్రం "ప్రతినిధి 2". నారా రోహిత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి టీవీ5 మూర్తిగా సుపరిచితుడైన మూర్తి దర్శకుడు. మరి ఎన్నికల వేళ విడుదలైన ఈ సీక్వెల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కథ: ధైర్యవంతుడైన చేతన్ (నారా రోహిత్) ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేస్తూ అక్రమార్కుల పనిపడుతూ ఉంటాడు. చేతన్ పనితనం నచ్చి ఎన్.ఎన్.సి ఛానల్ సీఈఓగా నియమించుకొంటుంది.ఇక ఆ ఛానల్ ద్వారా ఎందరో రాజకీయ అక్రమార్కుల అవినీతి భాగోతాలను ప్రజల ముందు ఉంచుతాడు చేతన్.అదే తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోవడంతో.. ఆయన కుమారుడు (దినేష్ తేజ్) ఆ పదవి దక్కించుకొనే ప్రయత్నానికి చేతన్ అడ్డుగా నిలుస్తాడు.అసలు ముఖ్యమంత్రి చావుకి కారణం ఏమిటి? దాన్ని కొందరు రాజకీయనాయకులు తమ లాభాల కోసం ఎలా వాడుకున్నారు? ప్రజలు ఈ రాజకీయ చట్రంలో ఇరుక్కుని ఎలా మోసపోతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానమే "ప్రతినిధి 2" సినిమా.


డైరెక్టర్ ఈ సినిమాని  ఒక సగటు కమర్షియల్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ప్లస్ పాయింట్. లేకపోతే ఈ ఎలక్షన్స్ సమయంలో ఈ మూవీ విడుదలయ్యేదే కాదు. అలాగే.. రాజకీయాలను ఒక జర్నలిస్ట్ పాయింటాఫ్ వ్యూలో తెరకెక్కించిన విధానం, ఎలక్షన్స్ ఇంకా నాయకులు ఎంపికవ్వడంలో జర్నలిస్టులు పోషించే కీలకపాత్రను తెరకెక్కించిన తీరు బాగుంది. అసలు ఈ మధ్యకాలంలో డెబ్యూ ఇచ్చిన చాలా మంది డైరెక్టర్స్ కంటే మూర్తి బెటర్.


అయితే.. సెకండాఫ్ లో నాటకీయత కొంచెం శృతి మించింది. కొన్ని సన్నివేశాలను చూపించిన విధానంలో లాజిక్స్ మిస్ అయ్యాయి. అయినా కానీ కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆ లాజిక్స్ ను కవర్ చేశాడు మూర్తి."ప్రతినిధి" అంత కాకపోయినా.. "ప్రతినిధి 2" ఓ మోస్తరుగా ఆకట్టుకొనే చిత్రమే. ప్రతి పౌరుడు కూడా ఓటు వేయాలని, ఆ ఓటు వేయకపోతే జరిగే నష్టాలను వివరించిన విధానం బాగుంది.


నారా రోహిత్ ఇంటెన్స్ యాక్టింగ్, మూర్తి టేకింగ్ & డైలాగ్స్ కోసం ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ & లాజిక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంకా సూపర్ హిట్ గా నిలిచేదీ సినిమా. ఈ సినిమాకి ఓవరాల్ గా 2.5/5 రేటింగ్ ఇవ్వొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: