దాహంతో ఉన్న పులి మాటుచూసి వేటాడుతుంది. అలాగే, ప్రభాస్ కూడా ఇప్పుడు దాహంతో ఉన్నాడు. హిట్టుకోసం వేచి చూస్తున్నాడు. రెబల్ అతణ్ణి తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ మిర్చిమీదనే పెట్టుకున్నాడు. మిర్చి ఆ ఆశలను నిలబెట్టింది. విడుదలైన మొదటిరోజునుంచీ హిట్ టాక్ తో నడుస్తోంది. కేవలం మాటలే కాదు... కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. ఆంధ్రా సీడెడ్ లలోనూ మంచి వసూళ్లే రాబడుతోంది. మరోపక్క విదేశాల్లోనూ మిర్చికి మంచి టాకే నడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే, వచ్చే వారం చివరినాటికి ఈ సినిమా ఎలా లేదన్నా కనీసంలో కనీసం రూ.40 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ‘అదే జరిగితే అది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే... ఈ ఏడాది రెండు భారీ హిట్లతో ప్రారంభమైన తెలుగు పరిశ్రమకు ఇప్పుడు మరో మంచి హిట్ దొరికితే అందరికీ మంచిదే కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: