తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలని తనకు నచ్చినట్లు నడిపించుకోవాలని ప్రతి మానవుడూ ఆశిస్తాడు. అలాగే కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అవ్వాలని, ఇంకొందరు పారిశ్రామిక వాణిజ్యవేత్తలు అవ్వాలని, ఇంకొందరు వెండితెరపై వినోదాన్ని పంచాలని కీర్తి ప్రతిష్ఠలు పొందాలని కోరుకోవచ్చు. ఆ సినీ రంగాన్ని నాయకీ నాయకులై ఒక వెలుగు వెలిగాలని తమ జీవితాలను ఆ దిశలో పండించుకోవాలని కోరుకునే హక్కు అందరికీ ఉంది. అయితే ఒకరికి మరొకరు తొక్కేసి జీవితాన్ని పరమపద సొఫానపటంగా మార్చే తాపత్రయం తోనే మనకు సమస్యలు వస్తున్నాయి.