నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ ఈ అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని పాలకు సంబంధించిన క్రొవ్వులు కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలసి ఉన్నట్టు తేలిందని ఈ పరీక్షల్లో వెల్లడైంది. నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువతో పోలిస్తే పరీక్షించిన నమూనాలలో చాలా తేడాలు ఉన్నాయని ఈ పరీక్ష ద్వారా తేలిందనే సంగతి తెలిసిందే.
ఒక్కో నమూనాను ఐదు ఈక్వేషన్స్ లో పరిశీలించి ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. అయితే గతంలో శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై కూడా వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. 2022 సంవత్సరంలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ సమయంలో బరువు చూసే యంత్రంలో లడ్డూ బరువును తక్కువగా చూపించడం అయితే జరిగింది. సాధారణంగా తిరుమల శ్రీవారి లడ్డూ బరువు 160 గ్రాముల నుంచి 180 గ్రాముల మధ్య ఉండాలి.
అయితే కొన్ని లడ్డూలు తక్కువ బరువుగా కనిపించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఆ సమయంలో టీటీడీ మాత్రం క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని తెలిపింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న ఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతున్నాయి. తిరుమల లడ్డూ వివాదం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. వైసీపీ మాత్రం శాంపిల్ సేకరించింది జులైలో అని పరీక్షలు చేసింది కూడా జులైలో అని అందువల్ల తప్పు టీడీపీదే అని చెబుతోంది.